2020లో అతడి టీ20 ర్యాంక్ 158.. బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించాడు. అప్పటికే టీంలో ఉన్న వికెట్ కీపర్, బ్యాటర్ సర్ఫరాజ్ అహ్మద్ వల్ల పెద్దగా ఛాన్స్‌లు దక్కించుకోలేకపోయాడు. కట్ చేస్తే.. సర్ఫరాజ్‌పై వేటు పడింది. రిజ్వాన్‌కు ఛాన్స్ లభించింది. దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 2021లో టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు.. అదే సూపర్బ్ ఫామ్ కంటిన్యూ చేస్తూ ఇప్పుడు అతడి జట్టు ర్యాంకింగ్‌కే ఎసురు పెట్టాడు.. టీ20ల్లో వరల్డ్ నెంబర్ 1గా ఎదిగాడు. అతడెవరో కాదు పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్.
తాజాగా ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో రిజ్వాన్.. వరల్డ్ నెంబర్ 1గా నిలిచాడు. అతడి సహా ఆటగాడు, పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌ను వెనక్కి నెట్టి.. ఈ ఫీట్ సాధించడం గమనార్హం. బాబర్ ఆజామ్ ప్రస్తుతం రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇటీవల జరుగుతున్న ఆసియా కప్ టోర్నమెంట్‌లో రిజ్వాన్ అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ 29 ఏళ్ల బ్యాటర్ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో.. 192 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. ఆసియా కప్‌లో టీమిండియాపై పాకిస్తాన్ గెలవడంలో రిజ్వాన్ కీలక పాత్ర పోషించాడు. టాప్ ఆర్డర్‌లో అర్ధ సెంచరీ చేసి.. తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఇదొక్కటే కాదు.. గతంలోనూ భారత్ జట్టుకు చెమటలు పట్టించాడు.. ఈ పాక్ ఓపెనర్.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఒకసారి పరిశీలిస్తే.. రిజ్వాన్(815) అగ్రస్థానంలో ఉండగా.. బాబర్ ఆజామ్(794), మార్కారమ్(792), సూర్యకుమార్ యాదవ్(775) ఆ తర్వాత వరుస స్థానాలను దక్కించుకున్నారు. ఇక ఐదో స్థానంలో మలాన్(731), ఫించ్(716) ఆరో స్థానంలో, కాన్వె(683), నిస్సంక(675), వసీమ్(671), హెండ్రిక్స్(628) చివరి మూడు స్థానాల్లో ఉన్నారు.
Name of Determination is Rizwan
Muhammad Rizwan is now ranked the No. 1 batsmen in ICC T20 men’s ranking ?♥️
You are our pride @iMRizwanPak
Keep shining Razii ✨❤??#ICCRankings #Rizwan#ICCRankings pic.twitter.com/cBToQcSR7P— Muhammad Iqbal (@MIQBALRAHI1) September 7, 2022