Mohammed Siraj: ఖరీదైన వాచ్‌తో మెరిసిన హైదరాబాదీ పేసర్.. ధరెంతో తెలిస్తే షాకే..!

|

Jan 09, 2024 | 1:33 PM

Team India: ఇటీవలే మహ్మద్ సిరాజ్ సౌతాఫ్రికా సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనవరి 11 నుంచి ఆఫ్ఘానిస్తాన్‌తో జరనున్న టీ20 సిరీస్‌ నుంచి విశ్రాంతి తీసుకుంటున్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో భాగమైన జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్‌లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. జనవరి 25 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌కు వీరు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.

Mohammed Siraj: ఖరీదైన వాచ్‌తో మెరిసిన హైదరాబాదీ పేసర్.. ధరెంతో తెలిస్తే షాకే..!
Mohammed Siraj Watch Price
Follow us on

Mohammed Siraj: భారత పేసర్ మహ్మద్ సిరాజ్ మైదానంలో తన అద్భుతమైన ప్రదర్శనలతోనే కాకుండా.. తన లైఫ్‌స్టైల్‌తోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. మైదానంలో తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్న ఈ హైదరాబాదీ పేసర్.. కేప్ టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ ఆకట్టుకున్నాడు. సిరాజ్ దెబ్బకు సౌతాఫ్రికా జట్టు మొత్తం 55 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్ ఒకే సెషన్‌లో 6 వికెట్లు పడగొట్టి, తన కెరీర్‌లోనే బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేశాడు.

అయితే, ప్రస్తుతం మహ్మద్ సిరాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ ఫొటోతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. షమీ విలాసవంతమైన జీవితానికి ఈ ఫొటోలు ఓ ఊదహారణగా నిలుస్తోంది. ఖరీదైన వస్తువులను తన ఇంటిలోనే కాదు.. తన ఒంటికి ధరిస్తున్నట్లు ఈ ఫొటోల్లో చూడొచ్చు. విలాసవంతమైన విహారయాత్రల నుంచి హైదరాబాద్‌లోని విలాసవంతమైన ఇంటి వరకు తన అభిరుచిని ప్రదర్శిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా, తన చేతికి ధరించిన ఓ లగ్జరీ బ్రాండెడ్ వాచ్‌తో నెట్టింట్లో సందడి చేస్తున్నాడు. అయితే, ఈ వాచ్ ధరను తెలుసుకుంటే మాత్రం కచ్చితంగా కళ్లు బైర్లు కమ్మా్ల్సిందే.

ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లలో మహమ్మద్ సిరాజ్ చాలా ఖరీదైన వాచ్‌ను కలిగి ఉన్న ఫొటోను పంచుకున్నాడు. తన చేతికి రోలెక్స్ డేటోనా ప్లాటినం వాచ్‌ను ధరించాడు. ఈ వాచ్ లుక్‌లోనే కాదు.. ధరతోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సెలబ్రిటీ అవుట్‌ఫిట్ డీకోడ్ ప్రకారం, ఈ వాచ్ ధర సుమారు రూ.1.01 కోట్లుగా పేర్కొంది.

సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన సిరాజ్.. క్రికెట్‌లో అద్భుత విజయాలతో దూసుకపోతున్నాడు. మహ్మద్ సిరాజ్ ప్రస్తుత నికర విలువ దాదాపు రూ. 42 కోట్లు అని నివేదికలు వినిపిస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో షమీ జీవితం ఎంతో మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రస్తుతం విశ్రాంతిలో..

కాగా, ఇటీవలే మహ్మద్ సిరాజ్ సౌతాఫ్రికా సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనవరి 11 నుంచి ఆఫ్ఘానిస్తాన్‌తో జరనున్న టీ20 సిరీస్‌ నుంచి విశ్రాంతి తీసుకుంటున్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో భాగమైన జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్‌లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. జనవరి 25 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌కు వీరు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..