Vaibhav Sooryavanshi: వైభవ్‎ను ఆడించండి.. వాడిని పక్కన పెట్టండి.. మహ్మద్ కైఫ్ డిమాండ్

Vaibhav Suryavanshi: ఆసియా క్రీడలు 2026లో వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సూచించారు. సంజు శాంసన్, అభిషేక్ శర్మతో కలిసి వైభవ్‌ను ఆడించాలని కోరారు. యశ్ ఠాకూర్ స్థానంలో వైభవ్‌ను తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. అలాగే తిలక్ వర్మ, శివమ్ దూబే ప్రదర్శనపైనా కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

Vaibhav Sooryavanshi: వైభవ్‎ను ఆడించండి.. వాడిని పక్కన పెట్టండి.. మహ్మద్ కైఫ్ డిమాండ్
Vaibhav Sooryavanshi

Updated on: Sep 23, 2026 | 3:50 PM

Vaibhav Sooryavanshi: ప్రస్తుతం జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games 2026) పాల్గొనేందుకు భారత పురుషుల టీ20 జట్టు అక్కడ సిద్ధంగా ఉంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమిండియా సెప్టెంబర్ 28 నుంచి తన టైటిల్ పోరును ప్రారంభించనుంది. అయితే జట్టులో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తాజాగా భారత మాజీ బ్యాటర్, అద్భుతమైన ఫీల్డర్‌గా పేరుగాంచిన మహ్మద్ కైఫ్ ఈ విషయంపై స్పందిస్తూ ఆసక్తికరమైన సలహా ఇచ్చారు.

వైభవ్, సంజు, అభిషేక్‌లను ఆడించాలి

భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌తో పాటు జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే మహ్మద్ కైఫ్ మాత్రం వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్, అభిషేక్ శర్మ ముగ్గురినీ ఒకేసారి ప్లేయింగ్ 11లో ఆడించాలని గట్టిగా సిఫారసు చేశారు. గతంలో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ లాంటి దిగ్గజాలు ఓపెనర్లు అయినప్పటికీ జట్టు కోసం ఎలా సర్దుబాటు చేసుకున్నారో గుర్తుచేశారు. అదే పద్ధతిలో ఈ ముగ్గురు యంగ్ అండ్ టాలెంటెడ్ ఆటగాళ్లను జట్టులో అడ్జస్ట్ చేయాలని సూచించారు.

యశ్ ఠాకూర్ బదులుగా వైభవ్‌

జపాన్‌లోని పిచ్‌ల స్వభావం పూర్తిగా టర్నింగ్ ట్రాక్‌లుగా మారుతున్న నేపథ్యంలో.. భారత్ ఒక ఫాస్ట్ బౌలర్‌ను తగ్గించుకుని అదనపు బ్యాటర్‌ను తీసుకోవాలని కైఫ్ అభిప్రాయపడ్డారు. పేసర్ యశ్ ఠాకూర్ ను పక్కన పెట్టి ఆ స్థానంలో వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం కల్పించాలని ఆయన సూచించారు. దీనివల్ల బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలంగా మారుతుందని, ప్రత్యర్థి జట్లకు దీటైన సమాధానం ఇవ్వొచ్చని కైఫ్ పేర్కొన్నారు.

తిలక్ వర్మ, శివం దూబేలపై వేటు పడే అవకాశం?

ఈ సందర్భంగా మహ్మద్ కైఫ్ జట్టులోని మరికొద్ది మంది ఆటగాళ్ల ప్రదర్శనపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆల్‌రౌండర్ శివమ్ దూబే,వైస్ కెప్టెన్ తిలక్ వర్మల ప్రదర్శన గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో లేదని ఆయన గుర్తుచేశారు. దూబే బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు సమర్పిస్తుండగా, బ్యాటింగ్‌లోనూ విఫలమవుతున్నాడని తెలిపారు. ఒకవేళ వీరు తమ ప్రదర్శనను మెరుగుపరచుకోకపోతే రాబోయే రోజుల్లో వీరి స్థానాలకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని, యువ ఆటగాళ్ల రాకతో వీరి కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని కైఫ్ హెచ్చరించారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us