Rohit Sharma: రోహిత్‌కు ఒక్క ఏడాది ఇవ్వలేకపోయాం..! భారత సెలెక్టర్లపై టీమిండియా మాజీ క్రికెటర్‌ ఫైర్‌

టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించి శుభ్‌మన్ గిల్‌ను బీసీసీఐ నియమించింది. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు కష్టమని అగార్కర్ వివరించారు. అయితే 16 ఏళ్లు దేశానికి సేవలందించిన రోహిత్‌కు ఏడాది కూడా ఇవ్వలేకపోయామని, ఐసీసీ టోర్నీల్లో అతని విజయాలను గుర్తించలేదని కైఫ్ అభిప్రాయపడ్డారు.

Rohit Sharma: రోహిత్‌కు ఒక్క ఏడాది ఇవ్వలేకపోయాం..! భారత సెలెక్టర్లపై టీమిండియా మాజీ క్రికెటర్‌ ఫైర్‌
Rohit

Updated on: Oct 05, 2025 | 9:26 AM

టీమిండియా మాజీ కెప్టెన్రోహిత్శర్మ విషయంలో బీసీసీఐ, భారత సెలెక్టర్లు కఠిన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రోహిత్ను వన్డే కెప్టెన్గా తప్పిస్తూ.. అతని స్థానంలో యువ క్రికెటర్శుబ్మన్గిల్ను వన్డే కెప్టెన్గా నియమించారు. ఇప్పటికే గిల్టెస్టు జట్టు కెప్టెన్గా కూడా న్న విషయం తెలిసిందే. అయితే రోహిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతన్నాయి. 2027 వన్డే వరల్డ్కప్వరకు రోహిత్ను వన్డే కెప్టెన్గా ఉంచాల్సిందని అభిప్రాయపడుతున్నారు.

కానీ, రోహిత్శర్మను కెప్టెన్గా తప్పించడంపై భారత జట్టు చీఫ్సెలెక్టర్అజిత్అగార్కర్మాట్లాడుతూ.. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు ఉండే కష్టమని, అందుకే గిల్కు వన్డే కెప్టెన్సీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇది వ్యూహత్మక నిర్ణయమని అన్నాడు. అయితే రోహిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై టీమిండియా మాజీ క్రికెటర్మొహమ్మద్కైఫ్స్పందిస్తూ.. రోహిత్శర్మ భారత క్రికెట్కు 16 ఏళ్లు ఇస్తే.. మనం అతనికి ఒక్క ఏడాది కూడా ఇవ్వలేకపోయాం అని అన్నాడు.

రోహిత్శర్మ దేశం కోసం 2024లో టీ20 వరల్డ్కప్గెలిచాడు. వెంటనే టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ప్రకటించాడు. ఇదే ఏడాది కెప్టెన్గా ఛాంపియన్స్ట్రోఫీ కూడా అందించాడు. టోర్నీ చివరి మ్యాచ్లో రోహిత్శర్మనే ప్లేయర్ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. మొత్తం 16 ఐసీసీ మ్యాచ్ల్లో రోహిత్శర్మ కెప్టెన్గా 15 మ్యాచ్లు గెలిచాడు. ఓడిన ఒక్క మ్యాచ్కూడా 2023 వన్డే వరల్డ్కప్ఫైనల్మ్యాచ్‌. అలాంటి రోహిత్కు మరో ఏడాది కెప్టెన్గా అవకాశం ఇచ్చి ఉండాల్సిందని కైఫ్అభిప్రాయపడ్డాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి