
అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (MLC)లో సియాటిల్ ఓర్కాస్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. తక్కువ స్కోరును కాపాడుకుంటూ టెక్సాస్ సూపర్ కింగ్స్‌పై 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్‌లో డసన్ షనక అద్భుత బౌలింగ్‌తో హ్యాట్రిక్ సహా మొత్తం నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను పూర్తిగా తన జట్టు వైపు తిప్పేశాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన సియాటిల్ ఓర్కాస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 121 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైనా, కామెరాన్ గానన్, హర్మీత్ సింగ్ కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో జట్టు 100 పరుగుల మార్క్‌ను దాటగలిగింది. చివర్లో షనక 16 పరుగులతో విలువైన సహకారం అందించాడు. టెక్సాస్ బౌలర్లలో అమ్షి డి సిల్వా 3 వికెట్లు తీయగా, ఆడమ్ మిల్నే నాలుగు ఓవర్లలో కేవలం 10 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
122 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టెక్సాస్‌కు ఫాఫ్ డు ప్లెసిస్ శుభారంభం ఇచ్చినా, ఒట్నీల్ బార్ట్‌మన్ వరుస దెబ్బలతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అతడు వికెట్-మెయిడెన్ సహా 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. మరోవైపు శుభమ్ రంజనే 40 పరుగులతో పోరాడుతూ జట్టును విజయానికి చేరువ చేశాడు. చివరి ఓవర్‌లో టెక్సాస్ విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి. తొలి రెండు బంతుల్లో ఫోర్, సింగిల్ రావడంతో మ్యాచ్ టెక్సాస్ వైపు మొగ్గుచూపినట్లు కనిపించింది. అయితే ఆ తర్వాత షనక తన ఎక్స్‌పీరియన్స్ చూపించాడు. డోనోవన్ ఫెరీరాను బౌల్డ్ చేసిన అతడు, కాల్విన్ సావేజ్, ఆడమ్ మిల్నేను అవుట్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. చివరి బంతికి అమ్షి డి సిల్వా కూడా క్యాచ్ ఇవ్వడంతో ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను అద్భుతంగా ముగించాడు. బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై ఇరు జట్ల బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయితే సియాటిల్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని 20 ఓవర్లలో 112/9కే పరిమితం చేశారు. షనక 4/26తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి