MI vs CSK : ముంబై వర్సెస్ చెన్నై.. వాంఖడేలో హై ఓల్టేజ్ ఫైట్… రోహిత్, ధోనీ ఆడతారా? ప్లేయింగ్ 11 ఇదే

MI vs CSK : ముంబై యువ సంచలనం ఆయుష్ మ్హాత్రే గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమవ్వడం జట్టుకు పెద్ద దెబ్బ. ఆయన స్థానాన్ని భర్తీ చేసే రేసులో ఉర్విల్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో ఉర్విల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

MI vs CSK : ముంబై వర్సెస్ చెన్నై.. వాంఖడేలో హై ఓల్టేజ్ ఫైట్... రోహిత్, ధోనీ ఆడతారా? ప్లేయింగ్ 11 ఇదే
Mi Vs Csk

Updated on: Apr 23, 2026 | 4:08 PM

MI vs CSK : ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఆసక్తికరమైన పోరుకు సమయం ఆసన్నమైంది. టోర్నీలోనే అత్యంత విజయవంతమైన జట్లు ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నేడు వాంఖడే స్టేడియంలో తలపడనున్నాయి. అయితే, ఈ సీజన్‌లో రెండు జట్ల ప్రస్థానం ఆశాజనకంగా ఏమీ లేదు. ఇద్దరూ ఒకే పడవలో ప్రయాణిస్తూ గెలుపు కోసం తహతహలాడుతున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్ ప్రేమికులందరి కళ్లు ఇప్పుడు ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీలపైనే ఉన్నాయి.

రోహిత్, ధోనీల పరిస్థితి ఏంటి?

చెన్నై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. గాయం కారణంగా ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఎంఎస్ ధోనీ, మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లో తీవ్రంగా శ్రమించారు. ఆయన నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన పూర్తి స్థాయిలో ఆడకపోయినా, ఇంపాక్ట్ ప్లేయర్‎గా వచ్చి చివర్లో మెరుపులు మెరిపించే అవకాశం ఉంది. మరోవైపు ముంబై స్టార్ రోహిత్ శర్మ హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన ప్రాక్టీస్ సెషన్‌లో కనిపించలేదు. రోహిత్ ఆడతారా లేదా అన్నది టాస్ సమయంలోనే తేలనుంది.

ఆయుష్ మ్హాత్రే స్థానంలో ఎవరు?

ముంబై యువ సంచలనం ఆయుష్ మ్హాత్రే గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమవ్వడం జట్టుకు పెద్ద దెబ్బ. ఆయన స్థానాన్ని భర్తీ చేసే రేసులో ఉర్విల్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో ఉర్విల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఏకంగా 244 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించి సెంచరీ కూడా బాదాడు. నేడు ముంబై తరఫున ఆయన ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం మెండుగా ఉంది.

జట్ల బలబలాలు

ముంబై ఇండియన్స్ జట్టులో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఫామ్‌లో ఉండటం ప్లస్ పాయింట్. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో జట్టు సమతూకంతో ఉంది. బుమ్రా బౌలింగ్‌లో ఎప్పటిలాగే వికెట్లు తీస్తున్నాడు. ఇక చెన్నై జట్టులో రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్ బ్యాటింగ్ పైన అంతా ఆధారపడి ఉంది. శివమ్ దూబే మిడిల్ ఓవర్లలో సిక్సర్ల వర్షం కురిపించగలడు. బౌలింగ్‌లో నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్ కీలక పాత్ర పోషించనున్నారు.

లైవ్ ఎక్కడ చూడాలి?

ఈ ఉత్కంఠభరిత పోరు నేటి సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 7 గంటలకు టాస్ పడనుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. మొబైల్ యూజర్లు జియో హాట్‌స్టార్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11:

క్వింటన్ డికాక్ (WK), దానిష్ మాలేవర్, నమన్ ధీర్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (C), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, క్రిష్ భరత్, మిచెల్ శాంట్నర్, విల్ జాక్స్, జస్ప్రీత్ బుమ్రా.

ఇంపాక్ట్ ప్లేయర్: అశ్విని కుమార్.

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11:

సంజూ శాంసన్ (WK), రుతురాజ్ గైక్వాడ్ (C), ఉర్విల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జేమీ ఓవర్టన్, అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, గుర్జప్నీత్ సింగ్.

ఇంపాక్ట్ ప్లేయర్: ఎంఎస్ ధోనీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us