సచిన్‌ను ‘బ్రాండ్’గా మార్చిన ఆ మాస్టర్ మైండ్ ఇతనే..! వేల కోట్ల సామ్రాజ్యం వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరు..?

Sachin Tendulkar Brand Empire: భారత క్రికెట్ హిస్టరీలోనే కాదు.. ప్రపంచ క్రికెట్‌లోనూ లిటిల్ మాస్టర్ సచినల్ టెండూల్కర్ ఓ స్పెషల్ పేజీని లిఖించిన సంగతి తెలిసిందే. అయితే, సచిన్ టెండూల్కర్ సంపాదించిన ఆస్తుల వెనుక అసలైన మాస్టర్ మైండ్ ఒకరు ఉన్నారు.

సచిన్‌ను ‘బ్రాండ్’గా మార్చిన ఆ మాస్టర్ మైండ్ ఇతనే..! వేల కోట్ల సామ్రాజ్యం వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరు..?
Sachin Tendulkar

Updated on: Jan 05, 2026 | 9:09 AM

Sachin Tendulkar Brand Empire: క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ ఒక దైవం. అయితే, మైదానంలో ఆయన సాధించిన పరుగుల వెనుక ఎంత కష్టం ఉందో, మైదానం వెలుపల ఆయన్ను ఒక బహుళ జాతి బ్రాండ్‌గా మార్చడంలో ఒక వ్యక్తి కృషి అంతకంటే ఎక్కువే ఉంది. స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ అంటే తెలియని రోజుల్లోనే సచిన్‌తో కోట్లాది రూపాయల ఒప్పందాలు కుదిర్చి, భారత క్రీడా ప్రపంచపు వాణిజ్య రూపురేఖలను మార్చేసిన ఆ వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

భారతదేశంలో స్పోర్ట్స్ మార్కెటింగ్ అనే పదానికి అర్థం తెలియని 1990వ దశకంలో, సచిన్ టెండూల్కర్ అనే యువ సంచలనం ప్రపంచ క్రికెట్‌ను ఏలుతున్నాడు. ఆ సమయంలోనే మార్క్ మస్కరెన్హాస్ (Mark Mascarenhas) అనే వ్యక్తి సచిన్ జీవితంలోకి ప్రవేశించారు.

రూ. 30 కోట్ల డీల్.. అప్పట్లో ఒక సంచలనం..

1995వ సంవత్సరంలో మార్క్ మస్కరెన్హాస్ తన సంస్థ ‘వరల్డ్ టెల్’ (WorldTel) ద్వారా సచిన్ టెండూల్కర్‌తో ఐదు సంవత్సరాల కోసం ఏకంగా రూ. 30 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పట్లో ఒక క్రికెటర్ ఆ స్థాయిలో డబ్బు సంపాదించడం ఊహకందని విషయం. ఆ తర్వాత 2001లో ఈ ఒప్పందాన్ని రూ. 100 కోట్లకు పెంచారు. ఇది ప్రపంచ క్రీడా చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందాలలో ఒకటిగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

సచిన్‌ను ‘బ్రాండ్’గా మార్చిన విధానం..

కేవలం బ్యాట్ మీద స్టిక్కర్లు వేయడమే కాకుండా, పెప్సీ, బూస్ట్, ఎంఆర్ఎఫ్ (MRF), వీసా వంటి అంతర్జాతీయ బ్రాండ్లకు సచిన్ అంబాసిడర్‌గా మారడం వెనుక మార్క్ వ్యూహాలు ఉన్నాయి. సచిన్ టెండూల్కర్‌కు ఉన్న క్లీన్ ఇమేజ్‌ను బ్రాండ్లు ఎలా వాడుకోవాలో ఆయన ప్రపంచానికి చూపించారు.

నేటి ఆటగాళ్లకు ఆద్యుడు..

నేడు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ వంటి ఆటగాళ్లు వందల కోట్ల ఎండార్స్‌మెంట్లు పొందుతున్నారంటే, దానికి పునాది వేసింది మాత్రం మార్క్ మస్కరెన్హాస్, సచిన్ టెండూల్కర్ జంట మాత్రమే. దురదృష్టవశాత్తూ మార్క్ 2002లో ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన మరణం తర్వాత సచిన్ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. మార్క్ కేవలం మేనేజర్ మాత్రమే కాదు, సచిన్ కుటుంబంలో ఒక సభ్యునిలా ఉండేవారు.

నేటికీ సచిన్ టెండూల్కర్ బ్రాండ్ వాల్యూ తగ్గలేదంటే, దానికి దశాబ్దాల క్రితమే వేసిన ఆ పటిష్టమైన పునాదే కారణం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..