LSG vs GT, IPL 2024: యశ్ పాంచ్ పటాకా.. ఛేదనలో చతికిలపడిన గుజరాత్.. లక్నో హ్యాట్రిక్ విక్టరీ

|

Apr 08, 2024 | 12:18 AM

Lucknow Super Giants vs Gujarat Titans: ఐపీఎల్ 21వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ గుజరాత్ టైటాన్స్‌పై 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.

LSG vs GT, IPL 2024: యశ్ పాంచ్ పటాకా.. ఛేదనలో చతికిలపడిన గుజరాత్.. లక్నో హ్యాట్రిక్ విక్టరీ
Lucknow Super Giants
Follow us on

Lucknow Super Giants vs Gujarat Titans: ఐపీఎల్ 21వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ గుజరాత్ టైటాన్స్‌పై 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. మార్కస్ స్టొయినిస్ అర్ధ సెంచరీతో రాణించాడు. ఆ తర్వాత మోస్తరు స్కోరును చేధించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ తడబడింది. లక్నో బౌలర్ల ధాటికి 18.5 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటై 33 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. యశ్ ఠాకూర్ 5 వికెట్లు తీసి ఆ జట్టును దెబ్బ తీశాడు. స్పిన్నర్ కృనాల్ పాండ్యా 3 వికట్లు తీయగా, రవి బిష్నోయ్ ఒక వికెట్ తీశాడు. లక్ష్య ఛేదనలో గుజరాత్‌కు శుభమాన్ గిల్, సాయి సుదర్శన్ శుభారంభం అందించారు.. 6 ఓవర్లలో 54 పరుగుల భాగస్వామ్యం. కానీ కృనాల్ పాండ్యా సాయి సుదర్శన్‌ను ఔట్ చేయడంతో వికెట్ల పరంపర మొదలైంది. శుభమన్ గిల్ 19, కేన్ విలియమ్సన్ 1, శరత్ బీఆర్ 2, విజయ్ శంకర్ 17, దర్శన్ నల్కండే 12, రషీద్ ఖాన్ 0 పరుగులకు పెవిలియన్ చేరారు.

అంతకు ముందు లక్నో సూపర్ జెయింట్స్ తరఫున మార్కస్ స్టోయినిస్ 43 బంతుల్లో 58 పరుగులు చేశాడు. కేఎల్ రాహు 33 పరుగులు చేయగా, నికోలస్ పూరన్ 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆయుష్ బడోని 11 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే రెండేసి వికెట్లు తీశారు. రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

 

 

రెండు జట్ల XI ప్లేయింగ్

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):

శుభమన్ గిల్ (కెప్టెన్), శరత్ బిఆర్ (వికెట్ కీపర్), సాయి సందర్శన్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, దర్శన్ నల్కండే, మోహిత్ శర్మ.

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):

క్వింటన్ డి కాక్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్/కెప్టెన్), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, నవిన్-ఉల్-హక్, మయాంక్.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.