
2022లో IPL అరంగేట్రం చేసిన రెండు జట్లు, గుజరాత్ టైటాన్స్(GT), లక్నో సూపర్ జెయింట్స్(LSG) నిలకడగా రాణించాయి. మొదటి సీజన్‌లోనే ప్లేఆఫ్‌లకు చేరుకున్నాయి. గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే లక్నో ప్రయాణం ముగిసింది. బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) చేతిలో 14 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో రజత్ పాటిదార్ సెంచరీ చేయడం, చివరి ఓవర్‌లో బెంగళూరు స్ట్రాంగ్ బౌలింగ్ కారణంగా లక్నో ప్లేఆఫ్‌లోనే నిష్క్రమించాల్సి వచ్చింది. బెంగుళూరు బ్యాటింగ్, వారి బ్యాటింగ్ సమయంలో లక్నో కొన్ని పొరపాట్లు చేసింది. ఇవి చివరికి జట్టును నష్టపరిచింది. లక్నో ఫీల్డర్లు విఫలమవడంతో చాలా క్యాచ్‌లు మిస్ చేశారు.
బెంగళూరు 14 ఓవర్లలో 117 పరుగులు చేయగా రజత్ పటీదార్ క్రీజులో ఉండగా, దినేష్ కార్తీక్ అతనికి మద్దతుగా నిలిచాడు. 15వ ఓవర్ ఐదో బంతిని దినేష్ కార్తీక్ భారీ షాట్ ఆడడంలో విఫలమయ్యాడు. అతను కొట్టిన షాట్ క్యాచ్‌గా వచ్చింది. దాని కోసం కెప్టెన్ KL రాహుల్ అతని ఎడమ వైపుకు పరుగెత్తాడు. కానీ విఫలమయ్యాడు.16వ ఓవర్ మూడో బంతికి రజత్ పాటిదార్ మిడ్ వికెట్ వైపు పుల్ షాట్ ఆడబోయి క్యాచ్ ఇచ్చాడు.. బౌండరీలో వద్ద ఉన్న దీపక్ హుడా ఈ సులభమైన అవకాశాన్ని చేజార్చాడు. ఆ సమయంలో రజత్ 40 బంతుల్లో 72 పరుగులు చేసి ఆడుతున్నాడు. ఈ తప్పుకు లక్నో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ ఇద్దరు బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు కేవలం 41 బంతుల్లో 92 పరుగులు చేసి జట్టును 207 పరుగులకు చేర్చారు. చివరికి లక్నో కేవలం 15 పరుగుల తేడాతో లక్ష్యాన్ని చేజార్చుకుంది.