LSG vs RCB : ఆర్సీబీ బౌలింగ్.. లక్నో బ్యాటింగ్.. ఏకానాలో అసలు సిసలు మజా

LSG vs RCB : లక్నో వేదికగా జరుగుతున్న ఈ కీలక పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఛేజింగ్‌లో తమ జట్టు మెరుగ్గా ఉంటుందని భావించిన పాటిదార్, లక్నోను తక్కువ స్కోరుకే కట్టడి చేయడమే తమ ప్రణాళిక అని వెల్లడించాడు.

LSG vs RCB : ఆర్సీబీ బౌలింగ్.. లక్నో బ్యాటింగ్..  ఏకానాలో అసలు సిసలు మజా
Lsg Vs Rcb

Updated on: May 07, 2026 | 7:15 PM

LSG vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా నేడు లక్నోలోని ఏకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన స్థితిలో ఉన్న ఈ రెండు జట్ల మధ్య టాస్ ప్రక్రియ ముగిసింది. ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. లక్నో వేదికగా జరుగుతున్న ఈ కీలక పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఛేజింగ్‌లో తమ జట్టు మెరుగ్గా ఉంటుందని భావించిన పాటిదార్, లక్నోను తక్కువ స్కోరుకే కట్టడి చేయడమే తమ ప్రణాళిక అని వెల్లడించాడు. ఆర్‌సీబీ ప్రస్తుతం 12 పాయింట్లతో టేబుల్‌లో రెండో స్థానంలో ఉన్నప్పటికీ, మిగిలిన జట్లు కూడా అదే పాయింట్లతో ఉండటంతో ఈ మ్యాచ్ విజయం వారికి ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుస్తుంది.

చరిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్

ఈ మ్యాచ్ ఆర్‌సీబీ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు అత్యంత ప్రత్యేకం. ఐపీఎల్ చరిత్రలో 200 మ్యాచ్‌లు ఆడిన మొట్టమొదటి ఫాస్ట్ బౌలర్‌గా భువీ రికార్డు సృష్టించాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే 9 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్న భువీపై విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్ చరిత్రలో టాప్-3 పేసర్లలో భువీ ఒకడని, అతని గేమ్ నాలెడ్జ్ అద్భుతమని కోహ్లీ కొనియాడాడు. భువీతో పాటు జోష్ హాజిల్‌వుడ్ జోడీ లక్నో బ్యాటర్లను ఎలా అడ్డుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి ఏంటి?

మరోవైపు రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్‌లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. బ్యాటింగ్ వైఫల్యం, డెత్ ఓవర్లలో బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వడం ఆ జట్టును కలవరపెడుతోంది. పంత్, మార్‌క్రమ్, మిచెల్ మార్ష్ వంటి స్టార్ ప్లేయర్లు రాణిస్తేనే ఆర్‌సీబీ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కోవచ్చు. ఏకానా స్టేడియంలో స్పిన్నర్లు కూడా కీలకం కానుండటంతో వనిందు హసరంగ ప్రదర్శనపై లక్నో ఆశలు పెట్టుకుంది.

జట్ల వివరాలు

లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI: మిచెల్ మార్ష్, అర్షిన్ కులకర్ణి, నికోలస్ పూరన్, ఐడెన్ మర్క్రమ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/కెప్టెన్), అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, మహ్మద్ షమీ,  ప్రిన్స్ యమద్ షమీ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI: జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దర్వుడ్,  జోష్ హజ్లే.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us