Sricharani: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కడప అమ్మాయి సత్తా.. ప్రపంచ నంబర్ వన్ బౌలర్‌గా శ్రీచరణి రికార్డు!

తెలుగింటి ఆడ బిడ్డ.. కడప జిల్లాకు చెందిన శ్రీచరణి మరో కీలక మైలు రాయిని అందుకుంది. కెరీర్ ప్రారంభించిన కొన్నాళ్లే ప్రపంచ క్రికెట్‌లో కీర్త పతాకం ఎగురవేసింది. తాజాగా ఐసీసీ రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్‌లో శ్రీచరణి.. ప్రపంచ నెంబర్ వన్ బౌలర్‌గా అవతరించి, సరికొత్త చరిత్ర సృష్టించింది.

Sricharani: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కడప అమ్మాయి సత్తా.. ప్రపంచ నంబర్ వన్ బౌలర్‌గా శ్రీచరణి రికార్డు!
Sricharani Bowling Stats T20 World Cup

Edited By:

Updated on: Jun 24, 2026 | 12:32 PM

క్రికెట్ ప్రపంచంలో కడప జిల్లా కీర్తి పతాకం ఎగిరింది. కెరీర్ ప్రారంభించిన కొద్దిరోజులకే అరుదైన మైలురాయిని అందుకొని, సంచలన ప్రదర్శనతో దూసుకుపోతోంది కడపకు చెందిన లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ శ్రీచరణి. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 బౌలర్స్ ర్యాంకింగ్స్‌లో శ్రీచరణి ప్రపంచ నంబర్ వన్ బౌలర్‌గా అవతరించి, సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం 21 ఏళ్ల వయసులోనే ఆమె ఈ అద్భుతమైన ఘనతను సొంతం చేసుకోవడం విశేషం.

టాప్‌లో శ్రీచరణి.. వెనుకంజలో ఇంగ్లాండ్ ప్లేయర్స్

తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో శ్రీచరణి తన స్థానాన్ని గణనీయంగా మెరుగుపరుచుకొని 753 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ రేసులో ఇంగ్లాండ్‌కు చెందిన చార్లీ డీన్ (733 పాయింట్లు), లీన్సీ స్మిత్ (726 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. పటిష్టమైన ఇంగ్లాండ్ బౌలర్లను వెనక్కి నెట్టి మరీ కడప చిన్నది నంబర్ వన్ పీఠాన్ని అధిరోహించడం గమనార్హం.

ఏడాదిలోనే అద్భుత ప్రస్థానం

గత ఏడాది జూన్‌లో అంతర్జాతీయ టీ20ల్లోకి అడుగుపెట్టిన శ్రీచరణి.. అరంగేట్రం చేసిన ఏడాది కాలంలోనే జట్టులో అత్యంత కీలక బౌలర్‌గా ఎదిగింది. ఇప్పటివరకు ఆడిన 25 మ్యాచ్‌ల్లోనే అద్భుతమైన ప్రదర్శనతో ప్రత్యర్థి జట్లను వణికించింది. లైన్ అండ్ లెంగ్త్‌పై పూర్తి నియంత్రణతో, పరుగులను కట్టడి చేస్తూ పొదుపుగా బౌలింగ్ చేయడం శ్రీచరణి ప్రత్యేకత. ఈ చిన్న ఫార్మాట్‌లో ఇప్పటివరకు ఆమె రెండుసార్లు నాలుగు వికెట్ల హాల్ సాధించి తన సత్తా చాటింది.

ప్రపంచకప్‌లో వికెట్ల వేట..

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లోనూ శ్రీచరణి దూసుకుపోతోంది. టోర్నీలో ఇప్పటివరకు 10 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్ గా కొనసాగుతోంది. ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి భారత్‌ను విజయం వైపు నడిపించింది. ఇక నెదర్లాండ్స్ జట్టుపై మరింత విజృంభించి 4 వికెట్లతో పడగొట్టి ప్రత్యర్థి కమర్షియల్ ఆర్డర్‌ను దెబ్బతీసింది. అటు సఫారీలతో ఓడినప్పటికీ.. తనదైన శైలిలో మూడు వికెట్లను కొల్లగొట్టింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us