టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించినప్పటి నుంచి.. తదుపరి కెప్టెన్ ఎవరన్నదానిపైనే చర్చ జరుగుతోంది. కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ టీ20 జట్టుకు కెప్టెన్ కావచ్చని, ఆ సత్తా అతనిలో ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అటు మాజీ క్రికెటర్లు ప్రస్తుత జట్టులో కెప్టెన్‌గా రాణించగల సత్తా ఏ ఆటగాడిలో ఉందో తమ అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు. టీమిండియా టీ20 తదుపరి కెప్టెన్‌గా రోహిత్ శర్మతో పాటు రిషత్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అటు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. కేఎల్ రాహుల్‌లో కెప్టెన్సీ లక్షణాలున్నాయని అభిప్రాయపడ్డారు. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ పేరును పరిశీలిస్తే మంచిదన్నారు. బీసీసీఐ భవిష్యత్తుపై దృష్టిపెట్టడం మంచి పరిణామంగా పేర్కొన్నారు. ముందుచూపు చాలా అవసరమన్నారు.
ఇంగ్లాండ్ టూర్‌లోనూ కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌లో బాగా రాణించాడని గవాస్కర్ గుర్తుచేశారు. అలాగే ఐపీఎల్, 50 ఓవర్ల క్రికెట్‌లోనూ బాగా రాణిస్తున్నారని చెప్పారు. అంతర్జాతీయ వేదికలపైనా రాహుల్ ఆటతీరు మెరుగ్గా ఉందన్నారు. ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు కేఎల్ రాహుల్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్‌లో కెప్టెన్సీ భారం తన బ్యాటింగ్‌పై ప్రభావం పడకుండా చూసుకున్నాడని గవాస్కర్ పేర్కొన్నారు.
టీవీ9 తెలుగు పోల్..
టీమిండియా టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా వీరిలో ఎవరికుందని భావిస్తున్నారు? మీ ఓటును ఇక్కడ వేయండి..
టీమిండియా టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా వీరిలో ఎవరికుందని భావిస్తున్నారు?#TV9TeluguPoll #ViratKohli #IndiaT20ICaptain
— TV9 Telugu (@TV9Telugu) September 17, 2021
Also Read..