UP T20 League 2026: టీ20 లీగ్‌లో పరాకాష్టకు చేరిన ఉత్కంఠ.. రింకూ వికెట్ పడగొట్టి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ప్లేయర్

UP T20 League 2026: భారత లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ తన క్రికెట్ కెరీర్‌కు మైదానంలో ఘన వీడ్కోలు పలికాడు. మీరట్ మేవ్రిక్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో రింకూ సింగ్‌ను తన చివరి వికెట్‌గా పెవిలియన్‌కు పంపాడు. రింకూ 10 బంతుల్లో 30 పరుగులు చేసినా, కర్ణ్ శర్మ అనుభవంతో కీలక సమయంలో వికెట్ సాధించాడు. ఓటమితో ప్రయాణం ముగిసినా ఈ సన్నివేశం వైరల్‌గా మారింది.

UP T20 League 2026: టీ20 లీగ్‌లో పరాకాష్టకు చేరిన ఉత్కంఠ.. రింకూ వికెట్ పడగొట్టి  క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ప్లేయర్
Karn Sharma

Updated on: Aug 26, 2026 | 7:38 AM

UP T20 League 2026: భారత సీనియర్ 38 ఏళ్ల లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ ఇప్పటికే క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, ఆగస్టు 25న జరిగిన యూపీ టీ20 లీగ్ మ్యాచ్ ద్వారా తన సుదీర్ఘమైన క్రికెట్ ప్రయాణానికి మైదానంలో తుది వీడ్కోలు పలికాడు. కాన్పూర్ సూపర్ స్టార్స్ తరఫున ఆడిన కర్ణ్ శర్మకు మీరట్ మేవ్రిక్స్‌తో జరిగిన ఈ మ్యాచ్ పలు ప్రత్యేకమైన జ్ఞాపకాలను మిగిల్చింది. ఇందులో రింకూ సింగ్‌తో జరిగిన ముఖాముఖి పోరు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

రింకూ వర్సెస్ కర్ణ్ శర్మ

వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 5 ఓవర్లకు పొడిగించారు. మొదట బ్యాటింగ్ చేసిన మీరట్ మావెరిక్స్ జట్టు 5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 96 పరుగుల భారీ స్కోరు సాధించింది. మీరట్ ఇన్నింగ్స్ 4వ ఓవర్‌ను కర్ణ్ శర్మ వేశాడు. ఈ ఓవర్‌లోనే టీమిండియా స్టార్ ఫినిషర్ రింకూ సింగ్, కర్ణ్ శర్మ మధ్య అసలైన డ్రామా నడిచింది. ఓవర్ మొదటి బంతికి దివ్యాంశ్ జోషి సింగిల్ తీసి రింకూ సింగ్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. స్ట్రైక్‌లోకి వచ్చిన రింకూ సింగ్.. కర్ణ్ వేసిన రెండవ బంతిని భారీ సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత కర్ణ్ ఒక వైడ్ వేయగా, తదుపరి లీగల్ డెలివరీ డాట్ బాల్‌గా మారింది. నాల్గవ బంతికి రింకూ సింగ్ మళ్లీ మైండ్ బ్లాకింగ్ సిక్స్ బాదాడు.

ఇది కూడా చదవండి: Watch: జ్వరం భయం లేదట.. వర్షం చూస్తే ఆగలేడట! కొలంబోలో పంత్ ఫుల్ ఎంజాయ్‌మెంట్!

300 స్ట్రైక్ రేట్‌తో రింకూ – చివరి బంతికి కర్ణ్ రివేంజ్

ఈ పోరులో రింకూ సింగ్ పూర్తిగా పైచేయి సాధించినట్లు అనిపించినా, 5వ బంతికి కర్ణ్ శర్మ తన అనుభవాన్ని ఉపయోగించి రింకూ సింగ్‌ను క్యాచ్ అవుట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ కేవలం 10 బంతుల్లో 4 సిక్సర్లతో 300 స్ట్రైక్ రేట్‌తో 30 పరుగులు చేశాడు. ఇందులో 2 సిక్సర్లు కర్ణ్ శర్మ ఓవర్‌లోనే రావడం విశేషం. కర్ణ్ శర్మ తన చివరి ఓవర్‌లో 2 సిక్సర్లు, 1 డబుల్, 1 సింగిల్, 1 వైడ్‌తో మొత్తం 16 పరుగులు ఇచ్చి ఖరీదైన బౌలింగ్ చేసినప్పటికీ, రింకూ సింగ్‌ను తన కెరీర్‌లోని ఆఖరి వికెట్‌గా పడగొట్టడంలో విజయం సాధించాడు.

ఇది కూడా చదవండి: Watch Video: సిరాజ్ మాటలకు బకరా అయిన లంక బ్యాటర్.. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే ఔట్

ఓటమితో ముగిసిన ప్రయాణం

కర్ణ్ శర్మ ఆఖరి మ్యాచ్‌లో గెలుపుతో వీడ్కోలు పొందలేకపోయాడు. 97 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన కాన్పూర్ సూపర్ స్టార్స్ జట్టు 5 ఓవర్లలో 3 వికెట్లకు 77 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో మీరట్ మేవ్రిక్స్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితం ఎలా ఉన్నా, ఒక స్టార్ బ్యాటర్‌ను అవుట్ చేస్తూ కర్ణ్ శర్మ వీడ్కోలు పలకడం మైదానంలో ఆసక్తికర సన్నివేశంగా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us