కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కివీస్ బౌలర్లు ఇంత తొందరగా రివర్స్ స్వింగ్ సృష్టిస్తారని ఊహించలేదని భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. తను ఔటైన బంతిని అంచనా వేయలేకపోయానని చెప్పాడు. గిల్ 93 బంతుల్లో 52 పరుగులు చేశాడు. రెండో సెషన్లో ఫాస్ట్ బౌలర్ కైల్ జేమీసన్ చేతికి చిక్కిన ముగ్గురు బ్యాట్స్మెన్లలో గిల్ ఒకడు. ” ముఖ్యంగా లంచ్ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు బంతి రివర్స్ స్వింగ్ అవ్వడం ప్రారంభించింది. నేను ఔటైన బంతిని అంచనా వేయలేకపోయాను” అని గిల్ మొదటి రోజు ఆట ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
జామీసన్ బౌలింగ్‌ను గిల్ ప్రశంసించాడు. ఎనిమిదో ఓవర్లో గిల్ ఓపెనింగ్ పార్టనర్ మయాంక్ అగర్వాల్‌ను అవుట్ చేయడం ద్వారా జేమీసన్ న్యూజిలాండ్‌కు బ్రేక్ ఇచ్చాడు. అనంతరం పుజారా, గిల్ 61 పరుగుల భాగస్వామ్యాన్ని జెమీసన్ విడగొట్టాడు. “ఈరోజు జేమీసన్ బాగా బౌలింగ్ చేశాడని నేను అనుకుంటున్నాను, ముఖ్యంగా అతను కొత్త బంతితో వేసిన మొదటి స్పెల్. అతను నాకు, మయాంక్ అగర్వాల్‌కి చాలా మంచి ఏరియాల్లో బౌలింగ్ చేశాడు. నేను లంచ్ తర్వాత బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు, ఆ ఓవర్ మొత్తం బంతి స్వింగ్ అవుతున్నట్లు ఉంది.” అని గిల్ అన్నాడు
” నేను నా రాష్ట్ర జట్టు, భారత్ A కోసం ఓపెనింగ్ చేశాను. నేను మిడిల్ ఆర్డర్లో కూడా బ్యాటింగ్ చేశాను. మీరు ఓపెనర్‌గా ఆడుతున్నప్పుడు లేదా మీరు మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా ఆడుతున్నప్పుడు కొంచెం ట్వీకింగ్ ఉంటుంది. శ్రేయాస్ అయ్యర్ అరంగేట్రంలో హాఫ్ సెంచరీ సాధించాడు. రవీంద్ర జడేజాతో కలిసి ఐదో వికెట్‌కు అజేయంగా 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. జడేజా 17వ టెస్ట్ హాఫ్ సెంచరీని కూడా చేరుకున్నాడు. ఇది రేపు కొనసాగుతుందని ఆశిస్తున్నాము.” అని శుభ్‌మన్ చెప్పాడు .
Read Also.. IND vs NZ: రహానె షాట్ ఎంపికపై లక్ష్మణ్ స్పందన.. అలా ఎలా ఆడతావంటూ ప్రశ్న..