IPL 2022: షాకిచ్చిన మాజీ సన్‌రైజర్స్ ప్లేయర్.. అయోమయంలో గుజరాత్.. హార్దిక్ ముందు 4 ఎంపికలు!

|

Mar 01, 2022 | 8:41 PM

ఐపీఎల్ 2022లో కొత్త జట్టైన గుజరాత్ టైటాన్స్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. బయో బబుల్ నిబంధనల కారణంగా ఇంగ్లాండ్...

IPL 2022: షాకిచ్చిన మాజీ సన్‌రైజర్స్ ప్లేయర్.. అయోమయంలో గుజరాత్.. హార్దిక్ ముందు 4 ఎంపికలు!
Jason Roy
Follow us on

ఐపీఎల్ 2022లో కొత్త జట్టైన గుజరాత్ టైటాన్స్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. బయో బబుల్ నిబంధనల కారణంగా ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్, విధ్వంసకర ఓపెనర్ జాసన్ రాయ్ ఐపీఎల్ 2022(IPL 2022) నుంచి వైదొలిగాడు. ఇక తన నిర్ణయాన్ని గుజరాత్ ఫ్రాంచైజీకి చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన మెగా వేలంలో జాసన్ రాయ్‌ను గుజరాత్ టైటాన్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. జాసన్ రాయ్ నిష్క్రమణతో.. గుజరాత్‌కు ఈ సీజన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. ఇదిలా ఉంటే.. జాసన్ రాయ్ గతేడాది జరిగిన తొలి ఫేజ్ ఐపీఎల్‌కు దూరం కాగా.. రెండో ఫేజ్‌లో సన్‌రైజర్స్ తరపున ఆడాడు. అలాగే ఐపీఎల్ 2020 సీజన్‌ నుంచి వ్యక్తిగత కారణాల వల్ల జాసన్ రాయ్ వైదొలిగిన విషయం విదితమే. మరోవైపు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడిన జాసన్ రాయ్.. 1 సెంచరీ, 2 అర్ధ సెంచరీలతో.. కేవలం 6 మ్యాచ్‌లలోనే 303 పరుగులు చేసి అదరగొట్టాడు. అటు జాసన్ రాయ్ వైదొలగడంతో.. ప్రత్యామ్నాయంగా గుజరాత్ పలు ఆటగాళ్ల పేర్లను పరిశీలిస్తోంది.

రహ్మానుల్లా గుర్బాజ్:

ఈ 20 ఏళ్ల అఫ్గానిస్థాన్‌ ఓపెనర్‌, కుడి చేతివాటం బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ బాధ్యతలను కూడా చూసుకోగలడు. గుర్బాజ్ తన విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. ఇప్పటివరకు 67 T20 మ్యాచ్‌లు ఆడిన గుర్బాజ్ 1617 పరుగులు చేశాడు.

బెన్ మెక్‌డెర్మాట్:

గుజరాత్‌కు మరో ఓపెనర్-వికెట్ కీపర్ ఆప్షన్ బెన్ మెక్‌డెర్మాట్. ఇటీవల జరిగిన బిగ్ బాష్ లీగ్‌లో బెన్ మెక్‌డెర్మాట్ అదరగొట్టే ప్రదర్శనతో అందరి చూపు తన వైపు తిప్పుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన బెన్ మెక్‌డెర్మాట్.. మొత్తం 13 మ్యాచ్‌ల్లో 577 పరుగులు చేశాడు.

మార్టిన్ గప్టిల్:

న్యూజిలాండ్‌ ఓపెనర్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్‌ కూడా జాసన్ రాయ్ రీప్లేస్‌మెంట్‌కు సరిగ్గా సరిపోతాడు. మార్టిన్ గప్టిల్ 108 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 32కి పైగా సగటుతో 3299 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా గప్టిల్‌కు ఐపీఎల్‌లో ఆడిన అనుభవం కూడా ఉంది.

డేవిడ్ మలాన్‌:

టీ20 ఇంటర్నేషనల్స్‌లో మలాన్ సగటు 40కి పైనే.. స్ట్రైక్ రేట్ కూడా 140కి చేరువలో ఉంది. ఎడమచేతివాటం బ్యాటర్.. బౌలర్లపై విరుచుకుపడతాడు. గుజరాత్‌కు మరో ఓపెనర్ శుభ్‌మాన్ గిల్‌ కావడంతో వీరిద్దరి కాంబినేషన్.. కచ్చితంగా ప్రత్యర్ధి బౌలర్లను ఇబ్బంది పెట్టొచ్చు.