
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి మాజీ క్రికెటర్, కోచ్ రవి శాస్త్రి(Ravi Shastri) ఓ సలహా ఇచ్చాడు. విరాట్ ఐపీఎల్(IPL)కు దూరంగా ఉండాలని సూచించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ , ప్రస్తుత క్రికెట్‌లోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా ఉన్నాడు. అయితే గత 2 సంవత్సరాలుగా అంతగా రాణించడం లేదు. విరాట్‌కు ఉన్న టాలెంట్ చూసిన ఎవరైనా అతన్ని క్రికెట్‌కు దూరం చేయగలరా? రవిశాస్త్రి సలహా కేవలం స్వల్పకాలిక ప్రణాళిక మాత్రమే.. తద్వారా విరాట్ మళ్లీ తన పాత స్థితికి చేరుకోవచ్చని శాస్త్రి అంచనా వేస్తు్న్నాడు. యూట్యూబ్ ఛానెల్‌లో జతిన్ సప్రూతో సంభాషణలో రవిశాస్త్రి విరాట్ కోహ్లీకి తన సలహా ఇచ్చాడు.
“అతను క్రికెట్‌కు కొంత దూరం ఉండటం అవసరమని నేను భావిస్తున్నాను. అతను నిరంతరం క్రికెట్ ఆడడమే ఇందుకు కారణం. ఈ కాలంలో అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ కూడా చేశాడు. కాబట్టి విరామం తీసుకోవడం మంచిది.” అని తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఒక అడుగు ముందుకేసి ఐపిఎల్ నుంచి తన పేరును ఉపసంహరించుకోవాలని సూచించాడు. ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ 128 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సమయంలో అతను రెండుసార్లు – లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై – గోల్డెన్ డక్ ఔట్ అయ్యాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 పరుగులే చేశాడు.
Read Also.. Ricky Ponting: ఆ రోజు నా గదిలో చాలా జరిగింది.. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌పై రికీ పాటింగ్ స్పందన..