Ishan Kishan: సూర్యకుమార్ రికార్డ్ బ్రేక్.. సరికొత్త చరిత్ర సృష్టించిన ఛోటా ప్యాకెట్.. !

Ishan Kishan T20I Records: న్యూజిలాండ్‌తో ఐదో టీ20లో ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు సృష్టించాడు. క్యాలెండర్ ఏడాదిలో భారత్ తరఫున అత్యధిక టీ20 అంతర్జాతీయ పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉన్న రికార్డును ఇషాన్ అధిగమించాడు. 2026లో 37 టీ20ల్లో ఇషాన్ 1,165 పరుగులు చేశాడు.

Ishan Kishan: సూర్యకుమార్ రికార్డ్ బ్రేక్.. సరికొత్త చరిత్ర సృష్టించిన ఛోటా ప్యాకెట్.. !
Ind Vs Nz 5th T20i Ishan Kishan Records

Updated on: Nov 01, 2026 | 3:12 PM

Ishan Kishan T20I Records: భారత్-న్యూజిలాండ్ (IND vs NZ) ఐదో టీ20లో ఇషాన్ కిషన్ (Ishan Kishan) అరుదైన ఘనత సాధించాడు. 2026 క్యాలెండర్ ఏడాదిలో భారత్ తరఫున అత్యధిక టీ20 అంతర్జాతీయ పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌కు ముందు ఇషాన్ రికార్డుకు చేరువలో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) 2022లో భారత్ తరఫున 32 టీ20లు ఆడి 1,164 పరుగులు చేశాడు. ఆ రికార్డును అధిగమించాలంటే ఇషాన్‌కు మరో ఆరు పరుగులు అవసరమయ్యాయి.

మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇన్నింగ్స్‌లో ఇషాన్ నాలుగో బంతినే సిక్సర్‌గా మలిచాడు. దీంతో అతడి పరుగుల సంఖ్య 1,165కి చేరింది. సూర్యకుమార్ రికార్డును ఇషాన్ అధిగమించాడు.

2026లో ఇషాన్ ఇప్పటివరకు 37 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 1,165 పరుగులు చేశాడు. అతడి అత్యధిక స్కోరు 103. ఈ ఏడాదిలో ఒక సెంచరీ, ఏడు హాఫ్ సెంచరీలు సాధించాడు.

ఇషాన్ తర్వాత ఎవరు?

ఈ జాబితాలో ఇషాన్ తర్వాత అభిషేక్ శర్మ (Abhishek Sharma) రెండో స్థానంలో ఉన్నాడు. 2026లో 39 టీ20లు ఆడిన అభిషేక్ 1,153 పరుగులు చేశాడు. అతడి ఖాతాలో రెండు సెంచరీలు, ఎనిమిది అర్ధ సెంచరీలు ఉన్నాయి.

ఒక క్యాలెండర్ సంవత్సరంలో టీ20లలో భారత జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు..

ఆటగాడు మ్యాచ్‌లు పరుగులు ఉత్తమ స్కోరు 100 50 0 సంవత్సరం
ఇషాన్ కిషన్ 37 1165* 103 1 7 3 2026
సూర్యకుమార్ యాదవ్ 31 1164 117 2 9 2 2022
అభిషేక్ శర్మ 39 1153* 113 2 8 7 2026
అభిషేక్ శర్మ 21 859 135 1 5 0 2025
సంజు సామ్సన్ 30 810* 97* 0 8 2 2026
విరాట్ కోహ్లీ 20 781 122* 1 8 1 2022
తిలక్ వర్మ 35 751 60* 0 5 0 2026
సూర్యకుమార్ యాదవ్ 18 733 112* 2 5 0 2023
శిఖర్ ధావన్ 18 689 92 0 6 0 2018
శ్రేయస్ అయ్యర్ 26 666 102* 1 2 0 2026

న్యూజిలాండ్‌తో ఐదో టీ20లో అభిషేక్‌కు కూడా సూర్యకుమార్ రికార్డును అధిగమించే అవకాశం వచ్చింది. అయితే అతడు కేవలం రెండు బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. రెండో ఓవర్ తొలి బంతికి ఆడిన భారీ షాట్‌ను డారిల్ మిచెల్ (Daryl Mitchell) క్యాచ్ పట్టడంతో అభిషేక్ ఇన్నింగ్స్ ముగిసింది.

ఈ ఏడాది టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంజు శాంసన్ (Sanju Samson) మూడో స్థానంలో ఉన్నాడు. 30 మ్యాచ్‌ల్లో అతడు 810 పరుగులు చేశాడు. తిలక్ వర్మ (Tilak Varma) 751 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) 666 పరుగులతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.

అయితే రికార్డు సృష్టించిన మ్యాచ్‌లో ఇషాన్‌కు బ్యాటింగ్‌లో పెద్ద ఇన్నింగ్స్ ఆడే అవకాశం దక్కలేదు. ఓపెనర్‌గా వచ్చిన అతడు 10 బంతుల్లో 4 పరుగులు చేసి మిచెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ప్రపంచ రికార్డు ఎవరి పేరిట?

క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక టీ20 అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాడి ప్రపంచ రికార్డు మాత్రం ఆస్ట్రియా ఆటగాడు కరణ్‌బీర్ సింగ్ (Karanbir Singh) పేరిట ఉంది. 2025లో 32 టీ20లు ఆడిన అతడు ఏకంగా 1,488 పరుగులు చేశాడు. పాకిస్థాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) 2021లో 29 మ్యాచ్‌ల్లో 1,326 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

2026లో భారత్ తరపున అత్యధిక టీ20ఐ పరుగులు..

ఆటగాడు మ్యాచ్‌లు పరుగులు ఉత్తమ స్కోరు 100 50 0
ఇషాన్ కిషన్ 37 1165* 103 1 7 3
అభిషేక్ శర్మ 39 1153* 113 2 8 7
సంజు సామ్సన్ 30 810* 97* 0 8 2
తిలక్ వర్మ 35 751 60* 0 5 0
శ్రేయస్ అయ్యర్ 26 666 102* 1 2 0
శివం దూబే 32 539 66 0 2 1
సూర్యకుమార్ యాదవ్ 14 484 84* 0 4 1
వైభవ్ సూర్యవంశీ 10 295 81 0 2 0
హడిక్ పాండ్యా 14 286 52 0 2 1
రింకు సింగ్ 13 152 44* 0 0 1
అక్షర్ పటేల్ 31 148 24 0 0 2
నమన్ ధీర్ 10 143 42* 0 0 1
నితీష్ కుమార్ రెడ్డి 10 112 41 0 0 0

భారత్ తరపున సూర్యకుమార్ రికార్డును అధిగమించిన ఇషాన్ కిషన్.. 2026లో టీ20 క్రికెట్‌లో తన పేరును ప్రత్యేకంగా నిలిపాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us