IPL 2024 Points Table: ఎస్‌ఆర్‌హెచ్ ఉత్కంఠ విజయంతో పాయింట్ల పట్టికలో మార్పులు.. అగ్రస్థానంలో ఏ జట్టు ఉందంటే?

|

Apr 10, 2024 | 10:50 AM

IPL 2024 23rd Match Points Table: పంజాబ్ తరుపున అశుతోష్ శర్మ 15 బంతుల్లో 2 సిక్సర్లు, 3 ఫోర్లతో 33 పరుగులు చేశాడు. శశాంక్ సింగ్ 25 బంతుల్లో 46 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి బ్యాటింగ్‌ కారణంగా మ్యాచ్‌ చివరి బంతికి దారి తీసింది. కానీ హైదరాబాద్ జట్టునే విజయం వరించింది. ఈ 17వ సీజన్‌లో 23వ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

IPL 2024 Points Table: ఎస్‌ఆర్‌హెచ్ ఉత్కంఠ విజయంతో పాయింట్ల పట్టికలో మార్పులు.. అగ్రస్థానంలో ఏ జట్టు ఉందంటే?
Points Table Pbks Vs Srh
Follow us on

IPL 2024 23rd Match Points Table: ఐపీఎల్ 17వ సీజన్ 23వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. 183 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ చివరి వరకు పోరాడినా.. విజయం సాధించలేకపోయింది. పంజాబ్ దాదాపు విజయానికి చేరువైంది. కానీ, ఆ ప్రయత్నం 2 పరుగులతో చేజారిపోయింది. 20 ఓవర్లలో పంజాబ్ 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంతకుముందు హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

పంజాబ్ తరుపున అశుతోష్ శర్మ 15 బంతుల్లో 2 సిక్సర్లు, 3 ఫోర్లతో 33 పరుగులు చేశాడు. శశాంక్ సింగ్ 25 బంతుల్లో 46 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి బ్యాటింగ్‌ కారణంగా మ్యాచ్‌ చివరి బంతికి దారి తీసింది. కానీ హైదరాబాద్ జట్టునే విజయం వరించింది. ఈ 17వ సీజన్‌లో 23వ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్ గెలుపుతో పాయింట్ల పట్టిక..

ఈ 23వ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో ఎలాంటి మార్పు లేదు. మ్యాచ్‌కు ముందు హైదరాబాద్‌, పంజాబ్‌లు వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో నిలిచాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఇరు జట్లు అదే స్థితిలో ఉన్నాయి. కానీ, హైదరాబాద్ విజయం, పంజాబ్ ఓటమి తర్వాత, రెండింటి నెట్ రన్ రేట్‌లో మార్పు వచ్చింది. హైదరాబాద్ నెట్ రన్ రేట్ మెరుగుపడింది. మ్యాచ్‌కు ముందు హైదరాబాద్ నెట్ రన్ రేట్ 0.409గా ఉంది. విజయం తర్వాత 0.344గా ఉంది. పంజాబ్ నెట్ రన్ రేట్ -0.220 కాగా, ఓటమి తర్వాత 0.196గా ఉంది. మొదటి 4 స్థానాల్లో వరుసగా రాజస్థాన్, కోల్‌కతా, లక్నో, చెన్నై ఉన్నాయి. గుజరాత్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ వరుసగా ఏడు నుంచి పదో స్థానాల్లో కొనసాగుతున్నాయి. కాగా, ఏప్రిల్ 10న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ టోర్నీలో 24వ మ్యాచ్ జరగనుంది.

ఇవి కూడా చదవండి

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభాసిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సామ్ కరణ్, సికందర్ రజా, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ మరియు అర్ష్‌దీప్ సింగ్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్: పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐదాన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..