IPL 2026 : ఇదేం చెత్త బౌలింగ్ రా సామీ ? ఒకే మ్యాచ్‌లో 60కి పైగా పరుగులు ఇచ్చిన ఐదుగురు చెత్త బౌలర్లు వీళ్లే
IPL 2026 : ఈ ఐపీఎల్ సీజన్లో కొందరు స్టార్ బౌలర్లు ఒకే మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకుని చెత్త రికార్డులను మూటగట్టుకున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న టాప్ 5 బౌలర్ల జాబితాలో పంజాబ్ కింగ్స్ బౌలర్లు ముగ్గురు ఉండటం గమనార్హం.

IPL Update : ఐపీఎల్ 2026 సీజన్ హాఫ్ సెంచరీ మార్కును (50 మ్యాచ్‌లు) దాటేసింది. ఈసారి బ్యాటర్ల విశ్వరూపంతో బౌలర్లు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా కొందరు స్టార్ బౌలర్లు ఒకే మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకుని చెత్త రికార్డులను మూటగట్టుకున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న టాప్ 5 బౌలర్ల జాబితాలో పంజాబ్ కింగ్స్ బౌలర్లు ముగ్గురు ఉండటం గమనార్హం. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు.
జేవియర్ బార్ట్లెట్ (పంజాబ్ కింగ్స్)
ఈ సీజన్‌లో అత్యంత ఖరీదైన బౌలర్‌గా పంజాబ్ కింగ్స్ ఆటగాడు జేవియర్ బార్ట్లెట్ నిలిచాడు. ఏప్రిల్ 25న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈయన తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 69 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లోనే కేఎల్ రాహుల్ అజేయంగా 152 పరుగులు చేయడం విశేషం. పాపం బార్ట్లెట్ వేసిన బంతులన్నీ బౌండరీలకే వెళ్లాయి.
అర్ష్‌దీప్ సింగ్ (పంజాబ్ కింగ్స్)
టీమ్ ఇండియా స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా ఈ జాబితాలో రెండో స్థానంలో ఉండటం షాకింగ్ విషయమే. ఏప్రిల్ 28న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన పోరులో తన హోమ్ గ్రౌండ్ (ముల్లాంపూర్)లో 4 ఓవర్లలో 68 పరుగులు ఇచ్చాడు. కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసి బ్యాటర్ల చేతిలో భారీగా దెబ్బతిన్నాడు.
సాకిబ్ హుస్సేన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)
సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్ సాకిబ్ హుస్సేన్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. తన మొదటి ఐపీఎల్ సీజన్ ఆడుతున్న ఈయన, ఏప్రిల్ 25న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 62 పరుగులు ఇచ్చాడు. అయితే అంతకుముందు మ్యాచ్‌లలో 4 వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచిన ఈయన, పంజాబ్ బ్యాటర్ల చేతిలో మాత్రం బుక్కైపోయాడు.
మార్కో యాన్సెన్ (పంజాబ్ కింగ్స్)
దక్షిణాఫ్రికా పేసర్ మార్కో యాన్సెన్ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. మే 6న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తన 4 ఓవర్లలో 61 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడిపోవడమే కాకుండా, పంజాబ్ బౌలర్ల వైఫల్యం జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. ఇది పంజాబ్ కింగ్స్‌కు వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం.
ప్రఫుల్ హింగే (సన్‌రైజర్స్ హైదరాబాద్)
ఈ లిస్టులో ఐదో స్థానంలో ఎస్ఆర్ హెచ్ బౌలర్ ప్రఫుల్ హింగే ఉన్నాడు. ఏప్రిల్ 18న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన 4 ఓవర్లలో 60 పరుగులు సమర్పించుకున్నాడు. ఇలా ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఐదుగురు బౌలర్లు 60 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు ఇచ్చుకుని భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
