AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న బౌలర్లు.. డాట్ బాల్స్ వేయడంలో తోపుల జాబితా ఇదే

IPL 2026 Top 5 Bowlers : సన్‌రైజర్స్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ వంటి వారు బౌలర్లను ఉతికి ఆరేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కొంతమంది బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ డాట్ బాల్స్‌తో బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు.

IPL 2026 : బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న బౌలర్లు.. డాట్ బాల్స్ వేయడంలో తోపుల జాబితా ఇదే
Ipl 2026 Top 5 Bowlers
Rakesh
|

Updated on: May 07, 2026 | 4:55 PM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ బ్యాటర్ల విన్యాసాలతో హోరెత్తిపోతుంది. 265 పరుగుల భారీ లక్ష్యాలను ఛేజ్ చేయడం, కేవలం 36 బంతుల్లోనే సెంచరీలు బాదడం వంటి అద్భుతాలు ఈ సీజన్‌లో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సన్‌రైజర్స్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ వంటి వారు బౌలర్లను ఉతికి ఆరేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కొంతమంది బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ డాట్ బాల్స్‌తో బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన 49 మ్యాచ్‌ల గణాంకాల ప్రకారం అత్యధిక డాట్ బాల్స్ వేసిన టాప్-5 బౌలర్లు ఎవరో తెలుసుకుందాం.

1. మొహమ్మద్ సిరాజ్ (గుజరాత్ టైటాన్స్) – 109 డాట్ బాల్స్

ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న మొహమ్మద్ సిరాజ్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో సిరాజ్ 37 ఓవర్లు (222 బంతులు) వేశాడు. అందులో ఏకంగా 109 బంతులు డాట్ బాల్స్‌గా ఉన్నాయి. అంటే దాదాపు సగం బంతులకు బ్యాటర్లు పరుగులేమీ చేయలేకపోయారు. సిరాజ్ ఇప్పటివరకు 11 వికెట్లు పడగొట్టి తన జట్టుకు కీలకంగా మారాడు.

2. జోఫ్రా ఆర్చర్ (రాజస్థాన్ రాయల్స్) – 107 డాట్ బాల్స్

ఇంగ్లాండ్ వేగవల్ సంచలనం జోఫ్రా ఆర్చర్ రాజస్థాన్ రాయల్స్ తరపున అదరగొడుతున్నాడు. ఇతడు కూడా 10 మ్యాచ్‌ల్లో 37 ఓవర్లు వేసి 107 డాట్ బాల్స్‌తో రెండో స్థానంలో నిలిచాడు. ఇతడి వేగానికి బ్యాటర్లు బంతిని తాకడమే కష్టమవుతోంది. ఆర్చర్ ఇప్పటికే 15 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు.

3. కగిసో రబడ (గుజరాత్ టైటాన్స్) – 105 డాట్ బాల్స్

సౌతాఫ్రికా పేసర్ కగిసో రబడ గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ విభాగానికి వెన్నెముకగా నిలిచాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో 39 ఓవర్లు వేసిన రబడ 105 డాట్ బాల్స్‌తో మూడో స్థానంలో ఉన్నాడు. 100 కంటే ఎక్కువ డాట్ బాల్స్ వేసిన ముగ్గురు బౌలర్లలో ఇతను ఒకడు. రబడ ఇప్పటివరకు 16 వికెట్లతో రాణిస్తున్నాడు.

4. మొహమ్మద్ షమీ (లక్నో సూపర్ జెయింట్స్) – 95 డాట్ బాల్స్

ఈ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కష్టాలు ఎదురవుతున్నా, షమీ మాత్రం తన పదునైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లే ఆడిన షమీ 35 ఓవర్లలో 95 డాట్ బాల్స్ వేశాడు. తక్కువ మ్యాచ్‌లు ఆడినా టాప్-4లో ఉండటం షమీ నైపుణ్యానికి నిదర్శనం. ఇతను ఇప్పటివరకు 8 వికెట్లు పడగొట్టాడు.

5. అన్షుల్ కాంబోజ్ (చెన్నై సూపర్ కింగ్స్) – 94 డాట్ బాల్స్

చెన్నై సూపర్ కింగ్స్ యువ కెరటం అన్షుల్ కాంబోజ్ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. 10 మ్యాచ్‌ల్లో సుమారు 35.4 ఓవర్లు వేసి 94 డాట్ బాల్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు (17) తీసిన బౌలర్లలో భువనేశ్వర్ కుమార్‌తో పాటు అన్షుల్ సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us