AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Suryavanshi : రాసిపెట్టుకోండి.. హైదరాబాద్‌పై బుడ్డోడు రెచ్చిపోవడం ఖాయమట..!

Vaibhav Suryavanshi : యంగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ గత మ్యాచ్‌లో త్వరగా అవుట్ అయినప్పటికీ, అతనిలో పరుగులు సాధించాలనే కసి చాలా ఎక్కువగా ఉందని కొనియాడారు. వైభవ్ సాధారణంగా ఒక మ్యాచ్‌లో విఫలమైతే, తర్వాతి మ్యాచ్‌లో ఖచ్చితంగా భారీ ఇన్నింగ్స్‌తో కంబ్యాక్ ఇస్తాడని శ్రీకాంత్ విశ్లేషించారు.

Vaibhav Suryavanshi : రాసిపెట్టుకోండి.. హైదరాబాద్‌పై బుడ్డోడు రెచ్చిపోవడం ఖాయమట..!
Vaibhav Suryavanshi
Rakesh
|

Updated on: May 27, 2026 | 7:01 PM

Share

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ దశకు చేరుకుంది. దీంతో క్రికెట్ అభిమానుల్ నరాలు తెగే ఉత్కంఠ మొదలైంది. న్యూ చండీగఢ్ వేదికగా ఈరోజు (మే 27న) జరగబోయే హై వోల్టేజ్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఓడిపోతే టోర్నీ నుంచి ప్యాకప్ చెప్పాల్సిందే.. గెలిస్తేనే క్వాలిఫైయర్-2కు వెళ్లే అవకాశం ఉండటంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఒక చావో రేవో లాంటిది. ఈ మహా సంగ్రామానికి ముందు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌తో ఊచకోత కోయడం ఖాయమని ఆయన గట్టిగా చెబుతున్నాడు.

తన యూట్యూబ్ ఛానెల్‌లో మ్యాచ్ విశ్లేషణ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కంటే రాజస్థాన్ రాయల్స్ జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జోస్యం చెప్పారు. ఇరు జట్ల బలాబలాలను బట్టి ఆర్‌ఆర్‌ వైపు 55–45 శాతం మొగ్గు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. యంగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ గత మ్యాచ్‌లో త్వరగా అవుట్ అయినప్పటికీ, అతనిలో పరుగులు సాధించాలనే కసి చాలా ఎక్కువగా ఉందని కొనియాడారు. వైభవ్ సాధారణంగా ఒక మ్యాచ్‌లో విఫలమైతే, తర్వాతి మ్యాచ్‌లో ఖచ్చితంగా భారీ ఇన్నింగ్స్‌తో కంబ్యాక్ ఇస్తాడని శ్రీకాంత్ విశ్లేషించారు. ఓపెనింగ్‌లో వైభవ్, యశస్వి జైస్వాల్ కలిసి పవర్‌ప్లేలోనే మంచి పునాది వేస్తే ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయమని స్పష్టం చేశారు.

ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ సూర్యవంశీ నమ్మశక్యం కాని ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. కేవలం 14 ఏళ్ల ప్రాయంలోనే ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లీగ్‌లో సీనియర్ అంతర్జాతీయ బౌలర్లను ముప్పతిప్పలు పెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 14 మ్యాచ్‌ల్లో 41.64 అద్భుతమైన సగటుతో ఏకంగా 583 పరుగులు బాదాడు. ఇందులో ఒక మెరుపు సెంచరీతో పాటు మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్‌లో అతని అత్యుత్తమ స్కోరు 103 పరుగులు కావడం విశేషం. ప్రస్తుత అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఈ వండర్ కిడ్ ఏకంగా 6వ స్థానంలో నిలిచి తన సత్తా చాటుతున్నాడు.

రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ముంచేసే ప్లాన్ రెడీగా ఉందని కృష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ మిడిల్ ఆర్డర్‌లో ధ్రువ్ జురెల్ కూడా పీక్ ఫామ్‌లో ఉండటం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే, ఆర్‌ఆర్‌ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ ఈ మ్యాచ్‌లో అత్యంత కీలకం కాబోతున్నాడని తెలిపారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలను టార్గెట్ చేస్తూ ఆర్చర్ పవర్‌ప్లేలోనే రెండు ప్రాణాంతకమైన బంతులతో వారిని అవుట్ చేస్తే, మ్యాచ్ అక్కడికక్కడే రాజస్థాన్ వైపు తిరిగిపోతుందని శ్రీకాంత్ జోస్యం చెప్పారు. హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్‌ను పవర్‌ప్లేలోనే కూల్చేస్తే ఆర్‌ఆర్‌ సులభంగా విజయం సాధిస్తుందని ఆయన నమ్ముతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శ్రావణ వరలక్ష్మీ పూజ: లక్ష్మీదేవి అనుగ్రహం, సంపద రహస్యం ఇదే
శ్రావణ వరలక్ష్మీ పూజ: లక్ష్మీదేవి అనుగ్రహం, సంపద రహస్యం ఇదే
ఏపీలో మరో మూడు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. ఈ జిల్లాల్లోనే..
ఏపీలో మరో మూడు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. ఈ జిల్లాల్లోనే..
పాత బావుల్లోకి దిగితే ఎందుకు చనిపోతారు? విష వాయువులు ఎలా వస్తాయ్
పాత బావుల్లోకి దిగితే ఎందుకు చనిపోతారు? విష వాయువులు ఎలా వస్తాయ్
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల
ఈ రాశుల వారికి పండుగే పండుగ.. తిరుగులేని రాజయోగం
ఈ రాశుల వారికి పండుగే పండుగ.. తిరుగులేని రాజయోగం
సినిమాలు మానేసి వ్యాపారం చేసుకోమ్మన్నారు.. కట్ చేస్తే 350కుపైగా చ
సినిమాలు మానేసి వ్యాపారం చేసుకోమ్మన్నారు.. కట్ చేస్తే 350కుపైగా చ
ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్తే మీరే తోపులు.. 99శాతం మంది తికమక అయ్యేది
ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్తే మీరే తోపులు.. 99శాతం మంది తికమక అయ్యేది
ఏంటీ ఇంకా ఈకేవైసీ పూర్తి చేయలేదా.. అయితే జరగబోయేది ఇదే!
ఏంటీ ఇంకా ఈకేవైసీ పూర్తి చేయలేదా.. అయితే జరగబోయేది ఇదే!
ప్రేమ పెళ్లి.. 30ఏళ్ల కాపురం.. కట్‌చేస్తే భర్త పీక కోసి చంపేసింది
ప్రేమ పెళ్లి.. 30ఏళ్ల కాపురం.. కట్‌చేస్తే భర్త పీక కోసి చంపేసింది
2027 ప్రపంచకప్ కొత్త తేదీలు.. వేదికలు ఇవే
2027 ప్రపంచకప్ కొత్త తేదీలు.. వేదికలు ఇవే