MS Dhoni : ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌కి మహీ రెడీ.. చెపాక్‌లో చివరి పోరుకు క్లీన్ షేవ్ లుక్‌తో ఎంట్రీ

MS Dhoni : చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఎంఎస్ ధోనీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగబోతున్నారు. క్లీన్ షేవ్ లుక్‌తో ధోనీ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తాజాగా బయటకు వచ్చిన కొన్ని హింట్స్ చూస్తుంటే ధోనీ ఎంట్రీ పక్కా అని అర్థమవుతోంది.

MS Dhoni : ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌కి మహీ రెడీ.. చెపాక్‌లో చివరి పోరుకు క్లీన్ షేవ్ లుక్‌తో ఎంట్రీ
Dhoni (1)

Updated on: May 18, 2026 | 9:28 AM

MS Dhoni : చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. ఐపీఎల్ 2026 సీజన్ మొదలైనప్పటి నుంచి గాయం కారణంగా, కొన్ని వ్యూహాత్మక కారణాల వల్ల బెంచ్‌కే పరిమితమైన తలా ఎంఎస్ ధోనీ, సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే కీలక మ్యాచ్‌లో బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోనీ, తన హోమ్ గ్రౌండ్ అయిన చెపాక్ స్టేడియంలో చివరి హోమ్ గేమ్ ఆడబోతున్నాడనే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా బయటకు వచ్చిన కొన్ని హింట్స్ చూస్తుంటే ధోనీ ఎంట్రీ పక్కా అని అర్థమవుతోంది.

ఆదివారం ధోనీ తన హోటల్ నుంచి ప్రాక్టీస్ సెషన్‌కు బయలుదేరుతున్న సమయంలో కెమెరా కంటికి చిక్కాడు. మునుపటిలా క్లీన్ షేవ్ లుక్‌తో, ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్న ధోనీ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ తర్వాత నెట్స్‌లో ధోనీ బ్యాటింగ్ చేస్తున్న ఫోటోలను స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసింది. బంతిని ఎంతో క్లీన్‌గా హిట్ చేస్తూ ధోనీ పాత రోజులను గుర్తుచేశాడు. గత కొద్ది రోజులుగా ఫుట్‌బాల్ ఆడుతూ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్న ధోనీ, ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ బౌలర్లను ఎదుర్కోవడానికి సర్వ సిద్ధంగా ఉన్నాడు.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. 12 మ్యాచుల్లో 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్న సీఎస్‌కేకు, మిగిలిన రెండు మ్యాచుల్లో విజయం అత్యవసరం. ఇలాంటి డూ ఆర్ డై సిట్యుయేషన్‌లో ధోనీ లాంటి అనుభవజ్ఞుడు జట్టులో ఉంటే అది టీమ్ నైతిక బలాన్ని అమాంతం పెంచుతుంది. కేవలం బ్యాటర్‌గానే కాకుండా, గ్రౌండ్‌లో ధోనీ ఇచ్చే సలహాలు, సూచనలు ఎస్ఆర్‌హెచ్ లాంటి బలమైన జట్టును అడ్డుకోవడానికి ఎంతో కీలకం కానున్నాయి.

ఇది ధోనీకి చివరి ఐపీఎల్ కావచ్చనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఈ నేపథ్యంలో చెపాక్ స్టేడియంలో జరిగే ఈ సీజన్ చివరి హోమ్ మ్యాచ్‌లో ధోనీని లైవ్‌లో చూడాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. టికెట్ల కోసం భారీ క్యూలు కట్టారు. తమ ప్రియతమ కెప్టెన్‌ను పసుపు జెర్సీలో మైదానంలో చూసేందుకు చెన్నై నగరం అంతా సిద్ధమైంది. మరి ఎస్ఆర్‌హెచ్‌తో జరిగే ఈ పోరులో ధోనీ తన బ్యాట్‌తో పాత మెరుపులు మెరిపిస్తాడో లేదో చూడాలి. ఏదేమైనా ధోనీ రాకతో ఐపీఎల్ 2026 లో ప్లేఆఫ్స్ ఉత్కంఠ మరో లెవల్‌కు చేరుకుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us