AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 Final Ticket : ఐపీఎల్ ఫైనల్ టికెట్లు కావాలా? అయితే ఈ సీక్రెట్ ట్రిక్ తెలిస్తేనే మీ చేతికి టికెట్ దక్కుతుంది

IPL 2026 Final Ticket : ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి పెద్ద జట్లు ముందే నిష్క్రమించినప్పటికీ.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ టికెట్లకు ఉన్న డిమాండ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్‌ల అధికారిక టికెటింగ్ భాగస్వామిగా డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్‌ను ప్రకటించింది.

IPL 2026 Final Ticket : ఐపీఎల్ ఫైనల్ టికెట్లు కావాలా? అయితే ఈ సీక్రెట్ ట్రిక్ తెలిస్తేనే మీ చేతికి టికెట్ దక్కుతుంది
Ipl 2026
Rakesh
|

Updated on: May 28, 2026 | 4:58 PM

Share

IPL 2026 Final Ticket : క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 202 క్లైమాక్స్‎కు వచ్చేసింది. లీగ్ స్టేజ్ ముగిసి, ప్లే-ఆఫ్స్ మ్యాచ్‌లు నరాల తెగే ఉత్కంఠను రేపుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు టైటిల్ పోరు కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలోనే మే 31న (ఆదివారం) అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గ్రాండ్ ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి పెద్ద జట్లు ముందే నిష్క్రమించినప్పటికీ.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ టికెట్లకు ఉన్న డిమాండ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్‌ల అధికారిక టికెటింగ్ భాగస్వామిగా డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్‌ను ప్రకటించింది. మరి ఈ మ్యాచ్ టికెట్లు ఎప్పుడు, ఎక్కడ, ఎలా కొనాలో తెలియక సతమతమవుతున్న ఫ్యాన్స్ కోసం పూర్తి వివరాలతో కూడిన స్మార్ట్ గైడ్ ఇక్కడ అందుబాటులో ఉంది.

ఐపీఎల్ 2026 ప్లే-ఆఫ్స్, ఫైనల్ పూర్తి షెడ్యూల్:

మే 26 (మంగళవారం): క్వాలిఫైయర్ 1 (RCB వర్సెస్ GT) – ధర్మశాల (RCB విజయం సాధించి నేరుగా ఫైనల్‌కు చేరింది).

మే 27 (బుధవారం): ఎలిమినేటర్ (SRH వర్సెస్ RR) – న్యూ చండీగఢ్(రాజస్థాన్ గెలిచి క్వాలిఫైయర్ 2 ఆడనుంది )

మే 29 (శుక్రవారం): క్వాలిఫైయర్ 2 (GT వర్సెస్ ఎలిమినేటర్ విజేత) – న్యూ చండీగఢ్

మే 31 (ఆదివారం): గ్రాండ్ ఫైనల్ (RCB వర్సెస్ క్వాలిఫైయర్ 2 విజేత) – అహ్మదాబాద్.

(గమనిక: అన్ని ప్లే-ఆఫ్స్ మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి).

టికెట్ల అమ్మకాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?

ఈసారి బీసీసీఐ టికెట్ల అమ్మకాలను విడతల వారీగా చేపట్టింది. రూపే క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు మే 20, మే 22 తేదీల్లో ప్రత్యేక విండోల ద్వారా ముందే టికెట్లను బుక్ చేసుకునే ప్రియారిటీ యాక్సెస్ కల్పించింది. ఇక సాధారణ ప్రజల విషయానికొస్తే.. క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ టికెట్లు మే 21 నుంచి.. క్వాలిఫైయర్ 2, గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు మే 23 రాత్రి 8:00 గంటల నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చాయి. మ్యాచ్ తేదీలు దగ్గరపడుతున్న కొద్దీ టికెట్లకు విపరీతమైన రష్ పెరుగుతోంది.

ఆన్‌లైన్‌లో ఐపీఎల్ ఫైనల్ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి?

బ్లాక్ టికెట్లు, నకిలీ టికెట్ల బారిన పడి మోసపోకుండా ఉండటానికి బీసీసీఐ సూచించిన అధికారిక ప్లాట్‌ఫామ్‌లలో మాత్రమే టికెట్లు కొనుగోలు చేయాలి. కింద పేర్కొన్న సాధారణ స్టెప్స్ ఫాలో అయి మీ సీటును సులభంగా రిజర్వ్ చేసుకోండి:

స్టెప్ 1: మొదట మీ మొబైల్‌లో గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి District by Zomato యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి లేదా ఐపీఎల్ అధికారిక వెబ్‌సైట్ (iplt20.com)ని సందర్శించండి.

స్టెప్ 2: యాప్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ స్క్రీన్‌పై కనిపించే Sports లేదా IPL Playoffs అనే ప్రత్యేక బ్యానర్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: అక్కడ మీకు కావాల్సిన మ్యాచ్‌ను (ఉదాహరణకు: మే 31న జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్) సెలెక్ట్ చేసుకోండి.

స్టెప్ 4: ఆ తర్వాత స్టేడియం ఇంటరాక్టివ్ మ్యాప్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. మీ బడ్జెట్‌కు తగిన సీటింగ్ కేటగిరీని ఎంచుకుని, మీకు నచ్చిన సీట్లను సెలెక్ట్ చేసుకోండి.

స్టెప్ 5: చివరగా మీ యూపీఐ (UPI), క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ పూర్తి చేయండి. టికెట్లు డిజిటల్ రూపంలో (M-Tickets) మీ ప్రొఫైల్‌కు యాడ్ అవుతాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us