IPL 2026 CSK vs SRH : తొలి ఓవర్‌లోనే హిస్టరీ క్రియేట్ చేసిన సీఎస్‌కే.. సన్‌రైజర్స్‌కు చుక్కలు చూపించిన శాంసన్

IPL 2026 CSK vs SRH : ఐపీఎల్ 2026లో ఎస్‌ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే తొలి ఓవర్‌లోనే 17 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. చెన్నై అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఎంఎస్ ధోనీ నేటి మ్యాచ్‌లోనూ బరిలోకి దిగలేదు.

IPL 2026 CSK vs SRH : తొలి ఓవర్‌లోనే హిస్టరీ క్రియేట్ చేసిన సీఎస్‌కే.. సన్‌రైజర్స్‌కు చుక్కలు చూపించిన శాంసన్
Csk

Updated on: May 18, 2026 | 8:40 PM

IPL 2026 CSK vs SRH : ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య 63వ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఈ కీలక పోరులో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే మ్యాచ్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే సీఎస్‌కే ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. తొలి ఓవర్‌లోనే పరుగుల వరద పారించి సన్‌రైజర్స్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టేసింది.

సన్‌రైజర్స్ తరపున యువ బౌలర్ నితీష్ కుమార్ రెడ్డి తొలి ఓవర్ వేయగా.. చెన్నై ఓపెనర్ సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలి బంతినే నితీష్ నో-బాల్‌గా వేయగా, లభించిన ఫ్రీ-హిట్‌ను శాంసన్ భారీ సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాతి బంతిని ఫోర్‌గా పంపాడు. ఇక ఓవర్ చివరి బంతికి మరో ఫోర్ బాదడంతో మొదటి ఓవర్ ముగిసేసరికి చెన్నై స్కోరు 17 పరుగులకు చేరింది. ఐపీఎల్ చరిత్రలో మొదటి ఓవర్‌లోనే సీఎస్‌కే సాధించిన రెండో అత్యధిక స్కోరు ఇది. గతంలో 2015లో కోల్‌కతాపై ఈడెన్ గార్డెన్స్‌లో తొలి ఓవర్‌లోనే 19 పరుగులు సాధించిన రికార్డు మాత్రమే దీనికంటే ముందుంది.

చెన్నై అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఎంఎస్ ధోనీ నేటి మ్యాచ్‌లోనూ బరిలోకి దిగలేదు. టాస్ సమయంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ధోనీ ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌తో లేడని, అందుకే విశ్రాంతి తీసుకుంటున్నాడని తెలిపాడు. అయితే ధోనీ ఫ్యాన్స్‌కు ఒక చిన్న ఊరటనిచ్చే వార్త ఏంటంటే.. ఆయన రిటైర్మెంట్ ప్రకటించలేదు. గాయం నుంచి కోలుకుంటే తర్వాతి మ్యాచ్‌ల్లో ధోనీ ఆడే అవకాశం ఉందని రుతురాజ్ చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు పలు మార్పులతో బరిలోకి దిగాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్ (కెప్టెన్), శివాంగ్ కుమార్, ఇషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే.

చెన్నై సూపర్ కింగ్స్: సంజూ శాంసన్ (కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, అకీల్ హుస్సేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, స్పెన్సర్ జాన్సన్.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us