IPL 2024: 4, 6, 6, 4, 4, 4.. అయ్యర్ ఓవర్‌లో పంత్ విధ్వంసం.. హైలెట్‌గా ‘నో లుక్ సిక్స్’.. వీడియో చూశారా?

|

Apr 04, 2024 | 4:09 PM

రోడ్డు ప్రమాదంలో గాయపడి సుమారు ఏడాదిన్నర పాటు క్రికెట్ గ్రౌండ్ కు దూరంగా ఉన్నాడు రిషభ్ పంత్. ఎట్టకేలకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 తో రీ ఎంట్రీ ఇచ్చాడు. పునరాగమనం చేసినా అతని ఆటతీరుపై చాలా మందికి అనుమానాలు కలిగాయి. మునుపటి స్థాయిలో ఆడతాడా? లేదా? అన్నది సందేహాలు తలెత్తాయి. అయితే తన పవర్ హిట్టింగ్ తో వాటన్నిటినీ పటా పంచలు చేశాడీ డ్యాషింగ్ ప్లేయర్.

IPL 2024: 4, 6, 6, 4, 4, 4.. అయ్యర్ ఓవర్‌లో పంత్ విధ్వంసం.. హైలెట్‌గా నో లుక్ సిక్స్.. వీడియో చూశారా?
Rishabh Pant
Follow us on

రోడ్డు ప్రమాదంలో గాయపడి సుమారు ఏడాదిన్నర పాటు క్రికెట్ గ్రౌండ్ కు దూరంగా ఉన్నాడు రిషభ్ పంత్. ఎట్టకేలకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 తో రీ ఎంట్రీ ఇచ్చాడు. పునరాగమనం చేసినా అతని ఆటతీరుపై చాలా మందికి అనుమానాలు కలిగాయి. మునుపటి స్థాయిలో ఆడతాడా? లేదా? అన్నది సందేహాలు తలెత్తాయి. అయితే తన పవర్ హిట్టింగ్ తో వాటన్నిటినీ పటా పంచలు చేశాడు రిషబ్ పంత్. ఐపీఎల్ లో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు చేశాడు. ముఖ్యంగా విశాఖపట్నం వేదికగా బుధవారం (ఏప్రిల్ 03) రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ అద్భుత బ్యాటింగ్‌తో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఇచ్చిన 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుక బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు శుభారంభం లభించలేదు. కేవలం 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ధాటిగా ఆడడంపై పైనే ఎక్కువగా దృష్టిపెట్టిన పంత్ వెంకటేష్ అయ్యర్ ను పట్టపగలే చుక్కలు చూపించాడు. ఇకే ఓవర్లో ఆడు బౌండరీలు బాదాడు. అయ్యర్ వేసిన 12వ ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టిన రిషబ్ పంత్, రెండో బంతిని లాంగ్ ఆఫ్ మీదుగా సిక్సర్ గా మలిచాడు.

ఇక మూడో బంతిని ఫ్లిక్ చేయడం ద్వారా షార్ట్ ఫైన్ లెగ్ లో సూపర్బ్ సిక్సర్ బాదాడు. 4వ బంతికి మరో ఫోర్ కొట్టాడు. 5వ బంతికి ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేశాడు. చివరి బంతిని కూడా బౌండరీగా మలిచి ఒకే ఓవర్లో మొత్తం 28 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ కేవలం 25 బంతుల్లో 5 సిక్సర్లు, 4 ఫోర్లతో 55 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

పంత్ నో లుక్ సిక్స్.. వీడియో ఇదిగో..

 

అయితే 273 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 17.2 ఓవర్లలో 166 పరుగులకే కుప్పకూలింది. అయితే పంత్ మెరుపు ఇన్నింగ్స్ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది.

పంత్ ఇన్నింగ్స్ కు షారుఖ్ ఫిదా.. ఆత్మీయ అలింగనం .. వీడియో

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..