Viral Photo: 2 వరుస పరాజయాలతో కోహ్లీ పరేషాన్.. కట్‌చేస్తే.. టెన్షన్ తగ్గించిన వామికా.. వైరల్ ఫొటో..

Virat Kohli Vamika: లక్నో సూపర్ జెయింట్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ చివరి బంతికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది.

Viral Photo: 2 వరుస పరాజయాలతో కోహ్లీ పరేషాన్.. కట్‌చేస్తే.. టెన్షన్ తగ్గించిన వామికా.. వైరల్ ఫొటో..
Virat Kohli Viral

Updated on: Apr 11, 2023 | 5:20 PM

Virat Kohli Vamika Viral Photo: లక్నో సూపర్ జెయింట్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ చివరి బంతికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలో, విరాట్ కోహ్లీ కూతురు వామికతో సరదాగా కనిపించాడు. మంగళవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ, వామిక ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి.

స్విమ్మింగ్ పూల్‌లో విరాట్ కోహ్లీతో వామిక..

ఈ ఫొటోలో విరాట్ కోహ్లీ కూతురు వామికతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో సరదాగా గడుపుతున్నాడు. అయితే ఈ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. భారత మాజీ కెప్టెన్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌తో ఈ ఫొటోను పంచుకున్నాడు. విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ జనవరి 2021లో తల్లిదండ్రులు అయ్యారు. అయితే దంపతులిద్దరూ తమ కుమార్తె ఫొటోలను సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేయడానికి ఇష్టపడడం లేదు. అయితే వామిక ఫొటోలు చాలా సార్లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ 2023లో అద్భుతమైన ఫామ్‌లో విరాట్ కోహ్లీ..

ఐపీఎల్ 2023లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు భారత మాజీ కెప్టెన్ మూడు మ్యాచ్‌ల్లో యాభై పరుగుల మార్క్‌ను రెండుసార్లు దాటాడు. ఈ ఆటగాడు కూడా లక్నో సూపర్ జెయింట్‌పై అద్భుతమైన అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే జట్టు ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు చేసింది. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 213 పరుగులు చేసి విజయం సాధించింది. 19 బంతుల్లో 65 పరుగులు చేసిన నికోలస్ పూరన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us