IPL 2023: హైదరాబాద్ చేతిలో బలయ్యాడు.. కట్‌చేస్తే.. 363 రోజుల తర్వాత లక్కీ ఛాన్స్.. ప్రతీకారానికి సిద్ధమైన ప్లేయర్..

|

Apr 14, 2023 | 5:08 PM

Varun Chakravarthy, IPL 2023: ఓడిపోయిన చోటే గెలిచే అవకాశం కచ్చితంగా వస్తుందని అంటుంటారు. అయితే, ఇక్కడ మాత్రం ఆ పందెం మళ్లీ గెలవలేం. కానీ, ప్రతీకారం తీర్చుకునే అవకాశం మాత్రం ఉంది.

IPL 2023: హైదరాబాద్ చేతిలో బలయ్యాడు.. కట్‌చేస్తే.. 363 రోజుల తర్వాత లక్కీ ఛాన్స్.. ప్రతీకారానికి సిద్ధమైన ప్లేయర్..
Varun Chakravarthy
Follow us on

ఓడిపోయిన చోటే గెలిచే అవకాశం కచ్చితంగా వస్తుందని అంటుంటారు. అయితే, ఇక్కడ మాత్రం ఆ పందెం మళ్లీ గెలవలేం. కానీ, ప్రతీకారం తీర్చుకునే అవకాశం మాత్రం ఉంది. IPL 2023లో వరుణ్ చక్రవర్తి vs సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాం. వరుణ్ చక్రవర్తి కేకేఆర్ కీలక బౌలర్. ఆయన బౌలింగ్‌ను గత సీజన్‌లో SRH బ్యాట్స్‌మెన్స్ చితక్కొట్టారు. అయితే ఇప్పుడు మాత్రం అలా బాదడం వారికి అంత సులభం కాకపోవచ్చు.

ఐపీఎల్ 2023లో వరుణ్ చక్రవర్తి శైలి మారింది. ఐపీఎల్ 2022లో కనిపించిన వరుణ్ రూపం ఇదికాదు. గతం కంటే కంటే మరింత ప్రమాదకరంగా బౌలింగ్ చేస్తున్నాడు. అంటే ఈడెన్‌లో SRH బ్యాట్స్‌మెన్స్ పాలిట యముడిలా మారనున్నట్లు తెలుస్తోంది.

ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధం..

ఐపీఎల్ 2022లో 16 ఏప్రిల్ 2022న జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన వరుణ్ చక్రవర్తి సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. ఆ మ్యాచ్‌లో, సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ వరుణ్ చక్రవర్తిపై 3 ఓవర్లలో 45 పరుగులు చేశారు. ఇదిలా ఉండగా కోల్‌కతా నైట్ రైడర్స్ అందించిన 176 పరుగుల టార్గెట్‌ను 13 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ ఘన విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

నేడు ఏం జరుగుతుందో..

ఈసారి పరిస్థితులన్నీ వరుణ్ చక్రవర్తికి అనుకూలంగా ఉన్నాయి. ఒకటి, అతను ఫామ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్ ఈడెన్‌లో జరగనుంది. ఐపీఎల్ 2022లో 11 మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు మాత్రమే తీసిన వరుణ్.. ఐపీఎల్ 2023లో ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లోనే 4 వికెట్లు పడగొట్టాడు. సహజంగానే, ఈ గణాంకాలు ఈరోజు వరుణ్ చక్రవర్తితోపాటు KKRకి సంతోషం కలిగిస్తుంటే.. సన్‌రైజర్స్‌ను మాత్రం భయపెడుతున్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..