అప్పుడు పనికిరావని పక్కనపెట్టారు.. ఇప్పుడు వైలెంట్ అయ్యాడు.. కట్ చేస్తే.. SRHను తిట్టిపోస్తున్న నెటిజన్స్..

క్రికెట్‌లో ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. చివరి బంతికి కూడా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయని మరోసారి నిరూపించింది సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్.

అప్పుడు పనికిరావని పక్కనపెట్టారు.. ఇప్పుడు వైలెంట్ అయ్యాడు.. కట్ చేస్తే.. SRHను తిట్టిపోస్తున్న నెటిజన్స్..
Glenn Phillips

Updated on: May 08, 2023 | 5:07 PM

క్రికెట్‌లో ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. చివరి బంతికి కూడా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయని మరోసారి నిరూపించింది సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్. ఇందులో SRH చివరి బంతికి అద్భుత విజయాన్ని అందుకుంది. ఇక్కడ ఆఖరి బంతికి ఫలితం వచ్చినప్పటికీ.. అంతకంటే ముందుగా కేవలం 4 బంతుల్లోనే గేమ్ చేంజ్ చేశాడు గ్లెన్ ఫిలిప్స్. ఐపీఎల్ 2023లో, మే 7(ఆదివారం) జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య ఇది రెండో మ్యాచ్ కాగా.. మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈసారి హైదరాబాద్ వంతు వచ్చింది. లెక్క సరి చేయడంలో గ్లెన్ ఫిలిప్స్ కీలక పాత్ర పోషించాడు.

కేవలం 4 బంతుల్లోనే గేమ్ చేంజ్..

ఈ న్యూజిలాండ్ కుడిచేతి వాటం బ్యాటర్ 18వ ఓవర్‌లో బరిలోకి దిగాడు. ఈ ఓవర్‌లో అతడు 2 బంతుల్లో 3 పరుగులు చేశాడు. అదే ఓవర్లో కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్ ఔటయ్యాడు. ఇక హైదరాబాద్ విజయానికి చివరి 2 ఓవర్లలో 41 పరుగులు కావాల్సి ఉంది. ఇక ఫిలిప్స్ ఈ సీజన్‌లో తన రెండవ మ్యాచ్ ఆడాడు. అయితేనేం రూ. 13 కోట్ల ప్లేయర్ చేయలేని పనిని చేసి చూపించాడు. 19వ ఓవర్‌లో పెద్దగా అనుభవం లేని లెఫ్టార్మ్ పేసర్ కుల్దీప్ యాదవ్‌ను టార్గెట్ చేశాడు. ఈ ఓవర్ తొలి మూడు బంతుల్లో ఫిలిప్స్ వరుసగా 3 సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ వైపు తిప్పాడు. ఆ తర్వాతి బంతికి మళ్లీ ఫోర్ కొట్టాడు. ఐదో బంతికి మళ్లీ భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి అవుటయ్యాడు. ఫిలిప్స్ మ్యాచ్‌ని పూర్తి చేయలేకపోయినా. అతడు కేవలం 4 బంతుల్లో 22 పరుగులు చేసి జట్టును గట్టి పొజిషన్‌లో పెట్టాడు. ఫిలిప్స్ కేవలం 7 బంతులు మాత్రమే క్రీజులో నిలిచాడు, 25 పరుగులు చేశాడు. ఇక ఈ ఇన్నింగ్స్ మ్యాచ్‌కి కీలకంగా మారింది. దీని తర్వాత, చివరి ఓవర్ చివరి బంతికి సందీప్ శర్మ వేసిన నో బాల్ హైదరాబాద్‌కు మరో అవకాశాన్ని ఇచ్చింది. అబ్దుల్ సమద్ ఫ్రీ హిట్‌లో సిక్స్ కొట్టి విజయాన్ని అందించాడు.

రాజస్థాన్‌తో ప్రత్యేక అనుబంధం..

రాజస్థాన్‌ రాయల్స్‌తో గ్లెన్ ఫిలిప్స్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఐపీఎల్‌లో అతడికి ఇది రెండో సీజన్. మొదటి సీజన్ 2021లో ఫిలిప్స్ రాజస్థాన్‌ తరపున ఆడాడు. ఆ సమయంలో కేవలం 3 మ్యాచ్‌లలోనే భాగం అయ్యాడు. ఇక ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఫిలిప్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో అతడు మొదటి మ్యాచ్ ఏప్రిల్ 2న రాజస్థాన్‌తో ఆడగా.. అందులో 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక ఇప్పుడు మరోసారి రాజస్థాన్‌తో ఆడి.. హైదరాబాద్‌కు అద్భుత విజయాన్ని అందించాడు.

కాగా, రూ. 13.25 కోట్లతో కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్‌ విఫలమవుతున్నా.. అవకాశాలు ఇస్తూ వచ్చింది హైదరాబాద్. మొదట్లో గాయం నుంచి కోలుకున్నా దూరం పెట్టింది. ఇక ఇప్పుడు అంతా అయ్యాక ఛాన్స్ ఇచ్చింది. ఇన్ని మ్యాచ్‌లు ఓడిపోయాక ఫిలిప్స్‌కు ఛాన్స్ ఇస్తే ఏం లాభం.. ఇప్పుడు కళ్లు తెరిచారా అంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యాన్ని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు.