Viral Video: బ్యాటింగ్ చేసేందుకు ఎంట్రీ ఇచ్చిన ఓపెనర్స్.. కట్‌చేస్తే.. మైదానంలోకి అనుకోని అతిథి.. ఆగిన మ్యాచ్..

CSK vs LSG: ఐపీఎల్ 2023లో భాగంగా నేడు చెన్నై చేపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక వింత కనిపించింది. ప్రపంచంలోని అన్ని క్రికెట్ గ్రౌండ్స్‌లో ఈ విషయం కనిపించినా.. కిక్కిరిసిన చెన్నై మైదానంలో ఇలా జరగడం మాత్రం ఆశ్చార్యానికి గురిచేసింది.

Viral Video: బ్యాటింగ్ చేసేందుకు ఎంట్రీ ఇచ్చిన ఓపెనర్స్.. కట్‌చేస్తే.. మైదానంలోకి అనుకోని అతిథి.. ఆగిన మ్యాచ్..
Csk Vs Lsg Viral Video

Updated on: Apr 03, 2023 | 8:32 PM

IPL 2023, CSK vs LSG: ఐపీఎల్ 2023లో భాగంగా నేడు చెన్నై చేపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక వింత కనిపించింది. ప్రపంచంలోని అన్ని క్రికెట్ గ్రౌండ్స్‌లో ఈ విషయం కనిపించినా.. కిక్కిరిసిన చెన్నై మైదానంలో ఇలా జరగడం మాత్రం ఆశ్చార్యానికి గురిచేసింది. మూడేళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్ జరగనుండడంతో అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు మైదానంలోకి ప్రవేశించిన ఓ కుక్క.. అందరినీ పరుగులు పెట్టించేలా చేసింది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా మొదలయ్యేందుకు కారణమైంది.

IPL 2023లో చెన్నై వర్సెస్ లక్నో మధ్య జరుగుతోన్న ఈ ఏడవ మ్యాచ్‌లో, టాస్ తర్వాత, చెన్నై ఓపెనర్స్ బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి ఎంట్రీ ఇచ్చారు. లక్నో బౌలర్ మొదటి బంతిని వేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇంతలో ఒక కుక్క మైదానంలోకి ప్రవేశించి భద్రతా సిబ్బందిని పరుగులు పెట్టించింది. మైదానం అంతటా తిప్పేలా చేసింది. ఆ కుక్కను మైదానం బయటకు పంపించేందుకు ఎంతగానో శ్రమించాల్సి రావడంతో మ్యాచ్ 5 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది.

ఇవి కూడా చదవండి

మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడేళ్ల తర్వాత తిరిగి సొంతగడ్డపైకి వచ్చింది. కోవిడ్ -19 కారణంగా, ఐపీఎల్ మూడేళ్లపాటు నిర్వహిస్తున్నారు. చెన్నై ఆటగాళ్ల ఆటను చూసేందుకు సిద్ధమైన ప్రేక్షకులను ఈ కుక్క మరింత వెయిట్ చేయించింది. మొత్తానికి, పసుపు జెర్సీలు ధరించి వేలాది మంది అభిమానుల మధ్య మరోసారి అతని జట్టు చెపాక్ మైదానంలో ఆడుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us