
ఐపీఎల్ 2022(IPL 2022)లో ఎన్నో మార్పులు చూస్తూనే ఉన్నాం. ఒక సీజన్‌లో ఒక జట్టును గెలిపించిన ఒక ఆటగాడు.. తదుపరి సీజన్‌లో అతను మరొక జట్టులోకి వెళ్లే అవకాశం కూడా ఉంది. అలాగే పాత జట్టుపై భారీ ఇన్నింగ్స్‌లతో చెలరేగి ఆడుతుంటాడు. IPL 2022 సీజన్ కూడా భిన్నంగా ఏంలేదు. ఈసారి కూడా అదే విధమైన గేమ్ జరుగుతోంది. దీనికి తాజా ఉదాహరణ రాహుల్ త్రిపాఠి(Rahul Tripathi) రూపంలో ఎదురైంది. అతను తన పాత జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) తో తలపడిన ప్రతీసారి భారీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. పాట్ కమిన్స్, ఉమేష్ యాదవ్, సునీల్ నరైన్ వంటి బౌలర్లపై విరుచుకుపడిన రాహుల్ త్రిపాఠి, తన కొత్త జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తరపున అద్భుతమైన ఫిఫ్టీ కొట్టి తన జట్టు విజయానికి పునాది వేశాడు.
మొదట దినేష్ కార్తీక్ (ఆర్‌సీబీ), ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ (డీసీ) ఇదే బాటలో పయణించారు. ప్రస్తుతం రాహుల్ త్రిపాఠి కూడా అచ్చం అదే చేశాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు గత సీజన్ వరకు కోల్‌కతా నైట్ రైడర్స్‌లో భాగంగా ఉన్నారు. కానీ, ఈ సీజన్‌లో వేర్వేరు జట్లతో ఆడుతున్నారు. కోల్‌కతా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లలో 3 మాత్రమే ఓడిపోయింది. వారి ఓటమికి ఆ మూడు ప్రధాన కారణాలలో గత సీజన్ తర్వాత విడుదలైన ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు. మెగా వేలంలో రాహుల్ త్రిపాఠిని హైదరాబాద్ రూ.8.50 కోట్లకు కొనుగోలు చేసింది.
21 బంతుల్లో ఫిఫ్టీ..
ఆరోన్ ఫించ్, కేన్ విలియమ్సన్, శ్రేయాస్ అయ్యర్ వంటి కీలక బ్యాట్స్‌మెన్స్.. తమ అద్భుత ప్రదర్శనను చూపించడంలో విఫలం కాగా, బ్రబౌర్న్ మైదానంలో రాహుల్ త్రిపాఠి మాత్రం రెండు జట్లలోని అందర్ని ఓడిస్తూ.. చాలా సులభంగా బ్యాటింగ్ చేశాడు. KKR మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని రాహుల్ త్రిపాఠి ప్రత్యేకంగా టార్గెట్ చేశాడు. రాహుల్ తన తొలి ఓవర్‌లో 2 సిక్స్‌లు, 1 ఫోర్ సహాయంతో 18 పరుగులు కొల్లగొట్టాడు. రెండో ఓవర్‌లో కూడా అతనిపై విరుచుకపడ్డాడు. కేవలం 21 బంతుల్లో తన అద్భుతమైన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు.
విజయానికి బలమైన పునాది..
సునీల్ నరైన్, పాట్ కమిన్స్, ఆండ్రీ రస్సెల్‌లపై కూడా బౌండరీలు సాధించాడు. IPL అరంగేట్రం చేసిన మీడియం పేసర్ అమన్ ఖాన్ మొదటి ఓవర్‌లోనే సిక్స్‌లు, ఫోర్లు బాదేశాడు. ఆ తర్వాత అతనికి మళ్లీ ఓవర్ రాలేదు. త్రిపాఠి చివరకు 15వ ఓవర్‌లో ఆండ్రీ రస్సెల్‌తో ఔటయ్యాడు. కానీ, అప్పటికి అతను 36 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 71 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐడన్ మార్క్రామ్ తర్వాత ఈ పునాదిపై 36 బంతుల్లో 68 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌ను ఆడి విజయాన్ని అందించాడు.
Also Read: IPl 2022: వరుసగా మూడో విజయాన్ని సొంతం చేసుకున్న హైదరాబాద్.. ఏడు వికెట్ల తేడాతో కోల్‌కత్తాపై గెలుపు..