ఐపీఎల్ 2022 మెగా వేలంలో పలువురు ఆటగాళ్లు భారీ ధర పలికారు. సెట్ 2లో దేవదూత్ పడిక్కల్, సురేష్ రైనా, జాసన్ రాయ్, స్టివ్ స్మిత్, హెట్‌మెయర్, మిల్లర్, మనీష్ పాండే, రాబిన్ ఉతప్ప ఉన్నారు. వీరిలో శిమ్రన్ హెట్‌మేయర్ గరిష్ఠ ధరకు అమ్ముడుపోయాడు. అతన్ని రాజస్థాన్ రాయల్స్ రూ.8.5 కోట్లకు దక్కించుకుంది. అతని బెస్ ప్రైస్ రూ. 1.5 కోట్లుగా ఉంది. ఆ తర్వాత యువ ఆటగాడు దేవదూత్ పడిక్కల్ భారీ ధర పలికాడు. అతన్ని కూడా రాజస్థాన్ రాయల్స్ రూ.7.75 కోట్లకు కొనుగోలు చేసింది. పడిక్కల్ కనీస ధర 2 కోట్లుగా ఉంది.
మనీష్ పాండేను లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. అతని కనీస ధర రూ.1 కోటి కాగా అతన్ని సూపర్ జెయింట్స్ రూ.4.6 కోట్లకు కొనుగోలు చేసింది. రాబిన్ ఉతప్పను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకోంది. అతన్ని కనీస ధరతో చెన్నై సొంతం చేసుంది. అతడి కనీస ధర రూ.2 కోట్లు. జాసన్ రాయ్ కూడా బెస్ ప్రైస్ రూ. 2 కోట్లకే అమ్ముడుపోయాడు. అతడిని గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
అమ్ముడుపోని ఆటగాళ్లు
సెట్2లో సురేష్ రైనా, స్టీవ్ స్మిత్, డెవిడ్ మిల్లర్ అమ్ముడు పోలేదు. సురేష్ రైనా, స్టీవ్ స్మిత్ కనీస ధర 2 కోట్లు కాగా.. డెవిడ్ మిల్లర్ బెస్ ప్రైస్ కోటి రూపాయలు. వీరిని కొనుగోలు చేయడానికి ఏ జట్టూ సుముఖత చూపలేదు. దీంతో వారు అన్‌సోల్డ్ ఆటగాళ్లుగా నిలిచిపోయారు.
Read Also.. IPL 2022 Auction: వార్నర్‌ను దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఎంతకు అమ్ముడుపోయాడో తెలుసా.?