Ravi Shastri: రవి శాస్త్రిని కోచ్‎గా నియమించుకునేందుకు ఐపీఎల్ జట్ల ఆసక్తి.. ఇప్పటికే అతడిని సంప్రదించిన ఓ జట్టు యాజమాన్యం..!

|

Nov 12, 2021 | 3:50 PM

రవి శాస్త్రి భారత క్రికెట్ జట్టు చరిత్రలో అత్యుత్తమ కోచ్‌లలో ఒకరిగా నిలిచాడు. ఆటగాడిగా, వ్యాఖ్యాతగా, కోచ్‌గా క్రికెట్‎కు ఎంతో సేవ చేశాడు. రవి శాస్త్రికి 2017లో ప్రధాన కోచ్ బాధ్యతలు అప్పగించారు....

Ravi Shastri: రవి శాస్త్రిని కోచ్‎గా నియమించుకునేందుకు ఐపీఎల్ జట్ల ఆసక్తి.. ఇప్పటికే అతడిని సంప్రదించిన ఓ జట్టు యాజమాన్యం..!
Shastri
Follow us on

రవి శాస్త్రి భారత క్రికెట్ జట్టు చరిత్రలో అత్యుత్తమ కోచ్‌లలో ఒకరిగా నిలిచాడు. ఆటగాడిగా, వ్యాఖ్యాతగా, కోచ్‌గా క్రికెట్‎కు ఎంతో సేవ చేశాడు. రవి శాస్త్రికి 2017లో ప్రధాన కోచ్ బాధ్యతలు అప్పగించారు. అతని కాంట్రాక్ట్ 2019లో మరో రెండేళ్లు పొడిగించారు. అతని సారథ్యంలో జట్టు పలు విజయాలు సాధించింది. శాస్త్రి 65 టీ20 మ్యాచ్‌లకు కోచ్‌గా ఉన్నాడు. అందులో 42 మ్యాచ్‎ల్లో ఇండియా విజయం సాధించింది. అతని పదవీకాలం టీ20 ప్రపంచ కప్ 2021తో ముగిసింది.

అయితే ఈ వరల్డ్ కప్‎లో ఇండియా నాకౌట్ చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. మొదటి మ్యాచ్‎లో పాకిస్తాన్‎ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన భారత్.. రెండో మ్యాచ్‎ కవీస్ చేతిలో 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఆ తర్వాత ఆఫ్ఘానిస్తాన్, స్కాట్లాండ్, నమీబియాతో జరిగిన మ్యాచ్‎ల్లో భారీ తేడాతో విజయం సాధించినప్పటికీ సెమీస్ ఫైనల్‎కు వెళ్లలేకపోయింది. భారత్‎కు విజయవంతమైన కోచ్‎గా బాధ్యతలు నిర్వర్తించిన రవి శాస్త్రిని కోచ్‎గా నియమించుకునేందుకు ఐపీఎల్ జట్లు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంఛైజీలు అతడిని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్-2022లో 10 జట్లు పాల్గొనబోతున్నాయి. వచ్చే సీజన్ IPLలో కొత్త జట్లలో ఒకటి CVC క్యాపిటల్ పేరులేని అహ్మదాబాద్ జట్టు ఒకటి. ఈ కొత్త ఫ్రాంచైజీ తన ప్రధాన కోచ్‌ని ఇంకా ప్రకటించలేదు.

ఈ జట్టు మంచి మేనేజ్‌మెంట్, కోచింగ్ నైపుణ్యాలు కలిగిన కొంతమంది ప్రసిద్ధ వ్యక్తులతో కలిసి సంప్రదింపులు జరుపుతుంది. అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ జట్టు ప్రధాన కోచ్‎గా మాజీ భారత కోచ్‌ని తీసుకోవచ్చు అని వార్తలు వస్తున్నాయి. అనధికారిక వర్గాల సమాచారం ప్రకారం తమ జట్టు ఆఫ్‌ఫీల్డ్‌కు నాయకత్వం వహించడానికి మేనేజ్‌మెంట్ ఇప్పటికే స్టార్ కోచ్‌ను సంప్రదించినట్లు సమాచారం. ఒకవేళ శాస్త్రి జట్టు కోచ్‎గా వస్తే ఆ జట్టుపై భారీ అంచనాలు ఉంటాయి. ఐపీఎల్-2022కు త్వరలో మెగా వేలం నిర్వహించనున్నారు. ఈ వేలం నిబంధనల ప్రకారం ఒక ప్రాంఛైజీ కేవలం నలుగురిని మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉంది.

Read Also.. T20 World Cup 2021: వారిద్దరు మ్యాచ్‎ను మలుపు తిప్పారు.. ఆస్ట్రేలియాపై మాజీ క్రికెటర్ల ప్రశంసలు..