ఐపీఎల్ 2022 మెగా వేలానికి ఫ్రాంచైజీలు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే ఏడాదికి తన జట్టులో రిటైన్ చేసుకునే ప్లేయర్స్‌పై మల్లగుల్లాలు పడుతున్నాయి. అనుభవం, ఫామ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్ళను సెలెక్ట్ చేసుకుంటున్నాయి ఫ్రాంచైజీలు. ఈ క్రమంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నలుగురు కీలక ఆటగాళ్లను రిటైన్ చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి వాళ్లెవరో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.
మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, యుజువేంద్ర చాహల్, దేవదూత్ పడిక్కల్‌లను బెంగళూరు ఫ్రాంచైజీ ఉంచుకోనున్నట్లు ఇన్‌సైడ్ స్పోర్ట్స్ అనే సైట్ తెలిపింది. విరాట్ కోహ్లీకి రూ. 16 కోట్లు, ఏబీ డివిలియర్స్‌కి రూ.12 కోట్లు, చాహల్‌కి రూ. 8 కోట్లు, పడిక్కల్‌కు రూ. 4 కోట్లు చొప్పున చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. గతేడాది భారీ ధరకు పలికిన మ్యాక్స్‌వెల్ మరోసారి మెగా వేలంలోకి వెళ్లనున్నాడు.
ఐపీఎల్ 2020లో మ్యాక్సీ.. ఆర్‌సీబీకి ఒంటి చేత్తో ఎన్నో మ్యాచ్‌లు అద్భుత విజయాలను అందించాడు. ఇదిలా ఉంటే కొంతమంది ఏబీ డివిలియర్స్ మెగా ఆక్షన్‌లో రానున్నాడని.. మ్యాక్స్‌వెల్‌నే బెంగళూరు జట్టు రిటైన్ చేస్తుందని చెబుతున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.! కాగా, వచ్చే ఏడాది కొత్త కెప్టెన్‌తో.. సరికొత్త టీంతో.. రెట్టింపు ఉత్సాహంతో ఐపీఎల్ ట్రోఫీని సాధించాలని ఆర్‌సీబీ ఫ్రాంచైజీ ఉవ్విళ్ళూరుతోంది. మరి చూడాలి బెంగళూరు ఐపీఎల్ 2022లోనైనా కప్పు గెలుస్తుందో.? లేదో.?