Royal Challengers Bangalore: విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఐపీఎల్ 2021 ద్వితీయార్ధంలో చాలా మంది కొత్త ఆటగాళ్లను జోడించింది. చాలా మంది ఆటగాళ్లు వివిధ కారణాల వల్ల ఈ టోర్నీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఆయా స్థానాలను భర్తీ చేసుకోవడానికి కొత్త ప్లేయర్లను ఎంచుకుంది. శ్రీలంకకు చెందిన వనిందు హసరంగ కూడా ఇలా చేరిన వాడే. ఈ ఆల్ రౌండర్ భారతదేశంతో సిరీస్‌లో బలమైన ప్రదర్శన చేసి, ఐపీఎల్‌లో చోటు సంపాధించాడు. కానీ వనిందు హసరంగ ఇటీవలి ఫామ్ కోహ్లీ, అతని బృందానికి ఆందోళన కలిగించేలా తయారైంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో అతను బంతి, బ్యాట్ రెండింటిలో విఫలమయ్యాడు. మరి ఐపీఎల్ 2021 లో ఎలా రాణిస్తాడో చూడాలి.
దక్షిణాఫ్రికా సిరీస్‌లో విఫలం..
దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలో వనిందు హసరంగ 12 పరుగులు మాత్రమే చేసి నాలుగు వికెట్లు తీశాడు. మొదటి వన్డేలో 10 ఓవర్లు బౌలింగ్ చేసి, 52 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఇక రెండో మ్యాచ్‌లో ఒక వికెట్ కూడా తీయలేదు. ఈసారి 10 ఓవర్లలో 63 పరుగులు ఇచ్చాడు. తర్వాత మూడో వన్డేలో ఎనిమిది ఓవర్లు బౌలింగ్ చేసి, 32 పరుగులకు రెండు వికెట్లు తీసుకున్నాడు. అలాగే టీ 20 సిరీస్‌లోనూ బ్యాటింగ్‌లో రాణించలేకపోయాడు. మూడు మ్యాచ్‌లలో ఎనిమిది పరుగులు మాత్రమే చేయగలిగాడు. బౌలింగ్ మాత్రం మూడు వికెట్లు తీసుకున్నాడు.
వనిందు హసరంగ కెరీరీ..
అంతకుముందు, భారత్‌తో సిరీస్‌లో వనిందు హసరంగ మూడు టీ 20 ల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు. బ్యాట్‌తో 29 పరుగులు కూడా చేశాడు. వీటిలో, అతను చివరి టీ 20 లో తొమ్మిది పరుగులకు నాలుగు వికెట్లు తీసి 14 పరుగులతో అజేయంగా నిలిచి ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ 24 ఏళ్ల ఆటగాడి అంతర్జాతీయ కెరీర్‌ను పరిశీలిస్తే, 29 వన్డేల్లో అతను 23.73 సగటుతో 546 పరుగులు చేశాడు. మూడు అర్థ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 29 వికెట్లు తీశాడు. టీ 20 క్రికెట్‌లో 25 మ్యాచ్‌ల్లో 200 పరుగులు చేయడంతో పాటు 36 వికెట్లు తీసుకున్నాడు.
Our stars from Sri Lanka have arrived! ⭐️⭐️
Welcome to ??, Wanindu Hasaranga & Dushmantha Chameera! ?#PlayBold #WeAreChallengers #IPL2021 pic.twitter.com/YHHqf0Ln1w
— Royal Challengers Bangalore (@RCBTweets) September 15, 2021
Also Read: