India vs South Africa: తొలి సెంచరీతో దుమ్ము రేపిన షఫాలీ వర్మ.. చెన్నైలో లేడీ సెహ్వాగ్ రికార్డుల వర్షం..

India Women vs South Africa Women, One-off Test: భారత మహిళా క్రికెట్ జట్టు పవర్ ఫుల్ ఓపెనర్ షెఫాలీ వర్మ సౌతాఫ్రికాతో జరుగుతోన్న ఏకైక టెస్టులో సెంచరీతో అదరగొట్టింది. స్మృతి మంధానతో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి కెరీర్‌లో తన తొలి సెంచరీ నమోదు చేసింది. ఈ సెంచరీ కోసం ఆమె 113 బంతులు మాత్రమే తీసుకుంది. అందులో 15 ఫోర్లు, 2 సిక్సర్లు కూడా ఉన్నాయి.

India vs South Africa: తొలి సెంచరీతో దుమ్ము రేపిన షఫాలీ వర్మ.. చెన్నైలో లేడీ సెహ్వాగ్ రికార్డుల వర్షం..
Shafali Verma Century
Follow us

|

Updated on: Jun 28, 2024 | 1:44 PM

India Women vs South Africa Women Test: దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ షఫాలీ వర్మ తొలి రోజు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ సెంచరీ చేసింది. 113 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన ఆమె.. టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీతో తనదైన ముద్ర వేసింది.

షెఫాలీ-మంధానల ఇన్నింగ్స్‌తో చేతులెత్తేసిన దక్షిణాఫ్రికా బౌలర్లు..

భారత్-దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు మధ్య వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఇప్పుడు చెన్నై వేదికగా ఒక మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతోంది. ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు నిస్సహాయంగా కనిపించింది. టెస్టు మ్యాచ్‌ అయినప్పటికీ షెఫాలీ 113 బంతుల్లో సెంచరీ చేయగా, మంధాన 122 బంతుల్లోనే సెంచరీ సాధించింది.

ఈ ఇన్నింగ్స్‌లో వీరిద్దరూ బౌండరీల వర్షం కురిపించారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వూల్వార్డ్ తన ఆరుగురు బౌలర్లను ఉపయోగించారు. కానీ, వారిలో ఎవరూ వికెట్లు తీయలేకపోయారు. వార్త రాసే సమయానికి 51  ఓవర్లు ముగిసే సరికి షఫాలీ వర్మ 139 పరుగులు చేసి క్రీజులో ఉంది. స్మృతి మంధాన 142 పరుగులతో ఉంది.

వన్డే సిరీస్‌లోనూ దుమ్ము రేపిన భారత మహిళలు..

హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని భారత మహిళల జట్టు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో దక్షిణాఫ్రికాను ఓడించింది. మూడు మ్యాచ్‌లు గెలిచి భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో స్మృతి మంధాన రెండు సెంచరీలు చేసింది.

షఫాలీ ఇన్నింగ్స్, భాగస్వామ్యం ఎలా ఉంది?

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు షఫాలీ, స్మృతి మంధాన అద్భుతమైన శుభారంభాన్ని అందించారు. ఇద్దరూ లంచ్‌కు ముందు తమ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసి జట్టు స్కోరును వికెట్ నష్టపోకుండా 135 పరుగులకు తీసుకెళ్లారు.

లంచ్ తర్వాత కూడా ఇద్దరి అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. షఫాలీ తన అర్ధ సెంచరీని సెంచరీగా మార్చుకుంది.

షఫాలీ టెస్ట్ కెరీర్ ఎలా ఉంది?

షఫాలీ తన టెస్ట్ క్రికెట్ కెరీర్‌ను 2021 సంవత్సరంలో ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టుపై ప్రారంభించింది. ఆమె ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడింది. 9 ఇన్నింగ్స్‌లలో 52.75 సగటు, 66.14 స్ట్రైక్ రేట్‌తో 426* పరుగులు చేసింది.

ఈ సెంచరీతో పాటు 3 హాఫ్ సెంచరీలు కూడా చేసింది. ఈ మ్యాచ్‌లో ఆమె అత్యుత్తమ ప్రదర్శన కనిపించింది. ఆమె తన టెస్టు కెరీర్‌లో ఒక్కసారి మాత్రమే నాటౌట్‌గా నిలిచింది.

ఇరు జట్లు:

దక్షిణాఫ్రికా మహిళలు (ప్లేయింగ్ XI): లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), సునే లూస్, అన్నెకే బాష్, మారిజాన్ కాప్, డెల్మీ టక్కర్, నాడిన్ డి క్లర్క్, అన్నరీ డెర్క్‌సెన్, సినాలో జాఫ్తా(కీపర్), మసాబటా క్లాస్, నోంకులులేకో మ్లాబా, తుమీ సెఖుఖునే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..