AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND W vs BAN W: బంగ్లాదేశ్‌తో సెమీఫైనల్‌కు భారత్ రెడీ.. హెడ్ టు హెడ్‌ రికార్డులు ఎలా ఉన్నాయంటే?

India Women vs Bangladesh Women: మహిళల ఆసియా కప్ 2026 తొలి సెమీఫైనల్‌లో భారత్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సెప్టెంబర్ 10న రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ20ల్లో ఇరు జట్లు 24 సార్లు ఎదురుపడగా భారత్ 21 విజయాలు సాధించింది. బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది.

IND W vs BAN W: బంగ్లాదేశ్‌తో సెమీఫైనల్‌కు భారత్ రెడీ.. హెడ్ టు హెడ్‌ రికార్డులు ఎలా ఉన్నాయంటే?
Ind W Vs Ban W
Venkata Chari
|

Updated on: Sep 10, 2026 | 8:20 AM

Share

India Women vs Bangladesh Women Semi Final: మహిళల ఆసియా కప్ 2026లో తొలి సెమీఫైనల్‌కు రంగం సిద్ధమైంది. భారత్ మహిళల జట్టు, బంగ్లాదేశ్ మహిళల జట్టు సెప్టెంబర్ 10న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడనున్నాయి. మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత్ వరుసగా మూడు విజయాలతో ఈ దశకు చేరుకోగా, బంగ్లాదేశ్ రెండు విజయాలు, ఒక ఓటమితో సెమీఫైనల్ బెర్త్ సాధించింది.

టీ20ల్లో భారత్‌దే పైచేయి..

భారత్, బంగ్లాదేశ్ (IND-W vs BAN-W Head to Head) గణాంకాలను పరిశీలిస్తే.. భారత్ ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు 24 టీ20ఐ మ్యాచ్‌లు ఆడగా భారత్ 21 గెలిచింది. బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక్క మ్యాచ్ కూడా టై కాలేదు.

ఎక్కువమంది చదివినది: Video: 20 ఏళ్ల తర్వాత తొలిసారి చెత్త రికార్గ్.. మరోసారి పాకిస్తాన్ ఇజ్జత్ పాయే.. అదేంటో తెలుసా?

ఇవి కూడా చదవండి

వన్డే ఫార్మాట్‌లో 9 సార్లు తలపడిన ఈ జట్లలో భారత్ ఆరు విజయాలు సాధించింది. బంగ్లాదేశ్ ఒక మ్యాచ్‌లో గెలవగా, ఒకటి టైగా ముగిసింది, మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు.

భారీ స్కోరు నుంచి 51 పరుగుల వరకు..

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ (India vs Bangladesh Women T20I) చరిత్రలో అత్యధిక టీమ్ స్కోరు భారత్ పేరిట ఉంది. 2016 ఉమెన్స్ వరల్డ్ కప్ లో బెంగళూరులో బంగ్లాదేశ్‌పై భారత్ 163/5 చేసింది.

ఇక అత్యల్ప స్కోరు బంగ్లాదేశ్ పేరిట ఉంది. 2023 ఏషియన్ గేమ్స్ సెమీఫైనల్‌లో భారత్‌పై బంగ్లాదేశ్ కేవలం 51 పరుగులకే ఆలౌటైంది.

వ్యక్తిగత రికార్డుల్లో హర్మన్‌ప్రీత్..

భారత్-బంగ్లాదేశ్ T20I పోరులో అత్యధిక వ్యక్తిగత స్కోరు హర్మన్‌ప్రీత్ కౌర్ పేరిట ఉంది. 2014 Women’s World T20లో సిల్హెట్ వేదికగా ఆమె 59 బంతుల్లో 77 పరుగులు చేసింది.

ఈ రెండు జట్ల మధ్య T20Iల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కూడా హర్మన్‌ప్రీత్‌నే. 19 ఇన్నింగ్స్‌ల్లో 496 పరుగులు సాధించింది. స్మృతి మంధాన 18 మ్యాచ్‌ల్లో 380 పరుగులతో రెండో స్థానంలో ఉంది.

బౌలింగ్‌లో పూనమ్..

భారత్-బంగ్లాదేశ్ T20Iల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ పూనమ్ యాదవ్. తొమ్మిది మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీసిన ఆమె సగటు 6.80, ఎకానమీ 4గా ఉంది. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు శ్రావంతి నాయుడు పేరిట ఉన్నాయి. 2014లో కాక్స్ బజార్‌లో ఆమె 4/9 నమోదు చేసింది.

ఎక్కువమంది చదివినది: Video: 16 ఫోర్లు, 12 సిక్సర్లతో బీభత్సం.. 37 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కంటే డేంజరస్‌‌గా ఉన్నాడేందయ్యా..!

ఇటీవలి ముఖాముఖిలోనూ భారత ఆటగాళ్లదే పైచేయి కనిపించింది. 2026 ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా మాంచెస్టర్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో షఫాలీ వర్మ 34 బంతుల్లో 53 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. రాధా యాదవ్ 3/28తో అత్యధిక వికెట్లు తీసింది.

సెమీఫైనల్‌లో భారత్ తరపున షఫాలీ వర్మ, స్మృతి మంధాన బ్యాటింగ్‌పై, దీప్తి శర్మ, శ్రీ చరణి బౌలింగ్‌పై ప్రధానంగా దృష్టి ఉంటుంది. బంగ్లాదేశ్‌లో మారుఫా అక్తర్ మూడు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉంది. బ్యాటింగ్‌లో శోభనా మొస్తరీ మూడు మ్యాచ్‌ల్లో 77 పరుగులతో నిలిచింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us