
South Africa Women vs India Women: బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో భారత మహిళల జట్టు-దక్షిణాఫ్రికా మహిళల జట్టు మధ్య జరిగిన మూడో, చివరి వన్డేలో ఆతిథ్య టీమిండియా 6 వికెట్ల తేడాతో సులువైన విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆఫ్రికన్ జట్టుపై టీమిండియా విజయం సాధించింది. దీంతో మరో గేమ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. గత మ్యాచ్‌లో గెలిచిన హర్మన్‌ప్రీత్ సేన.. సిరీస్‌లో దక్షిణాఫ్రికాను వైట్‌వాష్ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 215 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్యాన్ని ఛేదించిన స్మృతి మంధాన 90 పరుగులు చేయడంతో టీమిండియా మరో 56 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.
𝙒𝙃𝘼𝙏. 𝘼. 𝙒𝙄𝙉! 👏 👏
A dominating show from the @ImHarmanpreet-led #TeamIndia as they beat South Africa by 6⃣ wickets in the third & final ODI to complete an ODI series cleansweep! 💪 💪
Scorecard ▶️ https://t.co/Y7KFKaW91Y#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/1aQYPqaQJ4
— BCCI Women (@BCCIWomen) June 23, 2024
భారత జట్టు బౌలర్లు తక్కువ మొత్తానికి ఆఫ్రికా జట్టును చిత్తు చేస్తే.. పరుగుల వేటలో భారత జట్టు బ్యాట్స్‌మెన్ అద్భుతంగా ఆడారు. స్మృతి మంధాన, షెఫాలీ వర్మ 61 పరుగులు జోడించారు. అనంతరం షెఫాలీ వర్మ 25 పరుగులు చేసి ఔటైంది. షెఫాలీ వర్మ ఔటైన తర్వాత స్మృతి మంధాన వేగంగా బ్యాటింగ్ కొనసాగించింది. అయితే, 83 బంతుల్లో 90 పరుగులు చేసి సెంచరీ లేకుండానే వెనుదిరింది.
ఈ సిరీస్‌లో స్మృతి మంధాన మూడో సెంచరీ చేసేందుకు మంచి అవకాశం దక్కించుకుంది. కానీ, ఒక్క రాంగ్ షాట్ కారణంగా వికెట్ పడిపోయింది. స్మృతి మంధానతో పాటు, టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేసి 48 బంతుల్లో 42 పరుగులు చేసింది. 216 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 40.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సులువుగా గెలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..