IND vs SA : కోల్‎కతా టెస్టులో టీమిండియా గెలిచి ఉంటే పాకిస్తాన్‌కు భారీ లాభం అయ్యేది.. ఇంతకీ ఏంటంటే ?

భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి పోరు కలకత్తాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్‌లో 30 పరుగుల తేడాతో సౌతాఫ్రికా గెలిచింది. రెండు రోజుల ఆట ముగిసేసరికి టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్... దక్షిణాఫ్రికాను 159 పరుగులకే ఆలౌట్ చేసి, ఆ తర్వాత 189 పరుగులు చేసి 30 పరుగుల ఆధిక్యం సాధించింది.

IND vs SA : కోల్‎కతా టెస్టులో టీమిండియా గెలిచి ఉంటే పాకిస్తాన్‌కు భారీ లాభం అయ్యేది.. ఇంతకీ ఏంటంటే ?
Wtc Points Table

Updated on: Nov 16, 2025 | 2:46 PM

IND vs SA : భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి పోరు కలకత్తాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్‌లో 30 పరుగుల తేడాతో సౌతాఫ్రికా గెలిచింది. రెండు రోజుల ఆట ముగిసేసరికి టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్… దక్షిణాఫ్రికాను 159 పరుగులకే ఆలౌట్ చేసి, ఆ తర్వాత 189 పరుగులు చేసి 30 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. వారి ఆధిక్యం కేవలం 63 పరుగులు మాత్రమే. మూడో రోజు మొదటి సెషన్‌లోనే సౌతాఫ్రికా రెండవ ఇన్నింగ్స్‌ను ముగించి సులభంగా విజయం సాధించాలని భారత్ భావించింది. కానీ అంచనాలు తలకిందులై 93పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ ఫలితం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం.

ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్‌లో 61.90% పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. భారత్ ఇప్పటివరకు ఆడిన 7 టెస్టుల్లో 4 గెలిచి, 2 ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. ఇక సౌతాఫ్రికా 2 టెస్టుల్లో 1 గెలిచి, 50% పాయింట్లతో నాలుగవ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలిచినా టేబుల్‌లో ర్యాంకులు మారే అవకాశం ఉంది.

కోల్‌కతా టెస్ట్‌లో భారత్ గెలిస్తే పాయింట్స్ టేబుల్‌లో మన స్థానం మరింత మెరుగయ్యేది. భారత్ ఖాతాలో ప్రస్తుతం 61.90% పాయింట్స్ ఉన్నాయి. ఈ గెలుపుతో అవి పెరిగి శ్రీలంకతో సమానంగా 66.67% అవుతాయి. భారత్.. శ్రీలంక కంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచినందున, ఆస్ట్రేలియా పక్కన టాప్-2లో చోటు దక్కించుకోవచ్చు. భారత్ గెలవడం వల్ల పాకిస్తాన్‌కు ఊహించని లాభం చేకూరుతుంది.సౌతాఫ్రికా పాయింట్స్ 33.33%కి పడిపోతాయి. దీంతో 50% పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న పాకిస్తాన్.. సౌతాఫ్రికాను వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి చేరుకుంటుంది.

మొదటి టెస్టులో సౌతాఫ్రికా గెలిచింది కాబట్టి ప్రస్తుతం వారి స్థానం కూడా మెరుగుపడుతుంది. సౌతాఫ్రికా పాయింట్స్ 50% నుంచి పెరిగి 66.67%కి చేరుతుంది. వారు శ్రీలంక కంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచినందున వారికి కూడా టాప్-2లోకి చేరింది. భారత్ ఈ మ్యాచ్‌లో ఓడిపోయింది కాబట్టి మన పాయింట్స్ తగ్గి 54.17% అవుతుంది. దీంతో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టేబుల్‌లో మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది.మొత్తంగా ఈ కోల్‌కతా టెస్ట్ మ్యాచ్ కేవలం సిరీస్‌కే కాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలబడటానికి కూడా చాలా కీలకంగా మారింది.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..