India vs Pakistan, Asian Games Final Live: బరిలోకి వైభవ్, అభిషేక్.. బ్యాటింగ్ షురూ

IND vs PAK Asian Games Final Live Score Updates in Telugu: ఆసియా గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. నిస్షిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో ఫైనల్ జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.

India vs Pakistan, Asian Games Final Live: బరిలోకి వైభవ్, అభిషేక్.. బ్యాటింగ్ షురూ
India Vs Pakistan, Asian Games Final Live

Updated on: Oct 03, 2026 | 10:02 AM

LIVE Cricket Score & Updates

  • 03 Oct 2026 09:55 AM (IST)

    India vs Pakistan Live: ఓపెనర్లుగా వైభవ్, అభిషేక్..

    టాస్ గెలిచిన ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టులో ఎలాంటి మార్పులేదు. ఓపెనర్లుగా వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ బరిలోకి దిగనున్నారు.

  • 03 Oct 2026 09:44 AM (IST)

    Pakitan Playing XI: పాకిస్తాన్ జట్టు ఇదే

    పాకిస్తాన్ ప్లేయింగ్ XI: సాహిబ్జాదా ఫర్హాన్ (కెప్టెన్), మాజ్ సదాకత్, హసన్ నవాజ్, సైమ్ అయూబ్, ఉస్మాన్ ఖాన్ (కీపర్), అబ్దుల్ సమద్, అరాఫత్ మిన్హాస్, అహ్మద్ డానియాల్, మహ్మద్ వసీం జూనియర్, అబ్రార్ అహ్మద్, సుఫ్యాన్ మోకిమ్.

  • 03 Oct 2026 09:42 AM (IST)

    ⁠Asian Games 2026 Final Live: టీ20ల్లో భారత్ తరపున అత్యధిక మ్యాచ్‌లాడిన ప్లేయర్లు..!

    159 – రోహిత్ శర్మ

    138 – హార్దిక్ పాండ్యా

    125 – విరాట్ కోహ్లీ

    113 – సూర్యకుమార్ యాదవ్

    107 – అక్షర్ పటేల్*

    100 – జస్ప్రీత్ బుమ్రా*

    జస్ప్రీత్ బుమ్రా తన 100వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ ఘనత సాధించిన మొత్తం 71వ ఆటగాడు మరియు ఆరో భారతీయ ఆటగాడు అతనే.

  • 03 Oct 2026 09:37 AM (IST)

    India Playing 11: భారత జట్టు ఇదే

    భారత్ ప్లేయింగ్ XI: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా.

  • 03 Oct 2026 09:31 AM (IST)

    ⁠India vs pakistan toss winner asia cup: టాస్ గెలిచిన భారత్

    టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్తాన్ టీం బౌలింగ్ చేయనుంది.

  • 03 Oct 2026 09:30 AM (IST)

    ⁠India vs pakistan toss winner asia cup: మొహ్సిన్ నఖ్వీ దూరం

    ఆసియా క్రీడలు 2026 (Asian Games 2026) పురుషుల క్రికెట్ స్వర్ణ పతక పోరుకు భారత్, పాకిస్థాన్ సిద్ధమవుతున్న వేళ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (Asian Cricket Council) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) గైర్హాజరు కానున్నారు.

  • 03 Oct 2026 09:25 AM (IST)

    India vs Pakistan Asian Games 2026 final live: వాతావరణం ఎలా ఉందంటే?

    శనివారం నిస్షిన్‌లో వాతావరణం స్పష్టంగా ఉంటుందని అంచనా. వర్షం పడే అవకాశం 10 శాతం ఉంది. ఉష్ణోగ్రత గరిష్టంగా 25 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుందని అంచనా. సెమీఫైనల్స్‌లో పిచ్ టర్న్, బౌన్స్‌కు అనుకూలించగా, ఫైనల్ కూడా బౌలర్లకు అదే విధమైన సహాయాన్ని అందించే అవకాశం ఉంది.

  • 03 Oct 2026 09:15 AM (IST)

    Asian Games Cricket Final: బలమైన బౌలింగ్ లైనప్

    బౌలింగ్ విభాగానికి జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహిస్తాడు. అతను గత మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్ కూడా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

  • 03 Oct 2026 09:05 AM (IST)

    IND vs PAK Final 2026: బరిలోకి వైభవ్..?

    15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సెమీఫైనల్‌లో శ్రీలంకపై 21 బంతుల్లో 38 పరుగులు చేశాడు. అతను తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. ఇషాన్ కిషన్ కూడా 173.91 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 80 పరుగులు చేశాడు.

  • 03 Oct 2026 08:59 AM (IST)

    13సార్లు ఓడిన పాక్

    భారత్, పాకిస్తాన్ ఇప్పటివరకు 17 టీ20 మ్యాచ్‌లు ఆడాయి. భారత్ 13 మ్యాచ్‌లు గెలవగా, పాకిస్తాన్ 3 మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ డ్రా అయింది.

  • 03 Oct 2026 08:41 AM (IST)

    నో హ్యాండ్ షేక్

    మ్యాచ్‌కు ముందు తలెత్తిన అతిపెద్ద ప్రశ్న ఇరు జట్ల మధ్య కరచాలనం గురించే. గత 383 రోజులుగా, ఆరు మ్యాచ్‌లుగా భారత పురుషుల, మహిళల క్రికెటర్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ దాడి అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. 2025 సెప్టెంబర్‌లో జరిగే పురుషుల ఆసియా కప్‌తో కరచాలనం చేయరాదనే విధానం ప్రారంభమైంది.

  • 03 Oct 2026 08:14 AM (IST)

    Asian Games 2026 Cricket Final Live Updates: భారత జట్టుదే ఆధిపత్యం

    ఆసియా క్రీడల పురుషుల క్రికెట్ ఫైనల్ నేడు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత ఆరు టీ20ఐలలో ప్రతీదానిలోనూ భారత్ విజయం సాధించింది. 2022 ఆసియా కప్‌లో పాకిస్తాన్ చివరిసారిగా భారత్‌ను ఓడించింది.

  • 03 Oct 2026 07:53 AM (IST)

    ప్లేయింగ్ 11పైనే ఫోకస్?

    భారత్ సెమీఫైనల్‌లో శ్రీలంకను 124 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ చేరింది. పాకిస్థాన్ సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. రెండు జట్లు టోర్నీలో ఇప్పటివరకు ఓటమి లేకుండా ఫైనల్‌కు చేరుకున్నాయి.

IND vs PAK Asian Games Final Live Score Updates in Telugu: ఆసియా గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. నిస్షిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో ఫైనల్ జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.

భారత్ సెమీఫైనల్‌లో శ్రీలంకను 124 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ చేరింది. పాకిస్థాన్ సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. రెండు జట్లు టోర్నీలో ఇప్పటివరకు ఓటమి లేకుండా ఫైనల్‌కు చేరుకున్నాయి.

ఇరుజట్లు..

భారత్ ప్లేయింగ్ XI: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా.

పాకిస్తాన్ ప్లేయింగ్ XI: సాహిబ్జాదా ఫర్హాన్ (కెప్టెన్), మాజ్ సదాకత్, హసన్ నవాజ్, సైమ్ అయూబ్, ఉస్మాన్ ఖాన్ (కీపర్), అబ్దుల్ సమద్, అరాఫత్ మిన్హాస్, అహ్మద్ డానియాల్, మహ్మద్ వసీం జూనియర్, అబ్రార్ అహ్మద్, సుఫ్యాన్ మోకిమ్.

Loading...
Unable to load recommendations.
Follow Us