AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ 3rd ODI: టాస్ పడకుండానే 3వ వన్డే రద్దయ్యే ఛాన్స్.. ఇదిగో లేటెస్ట్ అప్టేడ్..!

Hamilton Weather Forecast: భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ వరుణుడు అంతరాయం కలిగించగా, ఇప్పుడు హామిల్టన్‌లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. నవంబర్ 10న జరగనున్న ఈ మ్యాచ్ పూర్తిగా సాగుతుందా? లేక వర్షం కారణంగా రద్దవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

IND vs NZ 3rd ODI: టాస్ పడకుండానే 3వ వన్డే రద్దయ్యే ఛాన్స్.. ఇదిగో లేటెస్ట్ అప్టేడ్..!
Ind Vs Nz 3rd Odi Hamilton Weather Forecast
Venkata Chari
|

Updated on: Nov 09, 2026 | 1:50 PM

Share

Hamilton Weather Forecast: భారత్, న్యూజిలాండ్ (India vs New Zealand) జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ కీలక దశకు చేరుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పుడు మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని శుభ్‌మన్ గిల్ (Shubman Gill) సారథ్యంలోని భారత జట్టు పట్టుదలగా ఉంది. నవంబర్ 10న హామిల్టన్‌లోని సెడన్ పార్క్ (Seddon Park) మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ పోరుకు వర్షం అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది.

మ్యాచ్‌కు వరుణుడి ముప్పు!

హామిల్టన్‌లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. నవంబర్ 9న భారత ఆటగాళ్లకు పూర్తిస్థాయిలో ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా లభించలేదు. దీంతో పలువురు బ్యాటర్లు ఇండోర్ ప్రాక్టీస్‌కే పరిమితమయ్యారు. ఇదే వాతావరణం మ్యాచ్ రోజు కూడా కొనసాగవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.

రోజంతా వర్షాలు కురిసే అవకాశం!

AccuWeather నివేదిక ప్రకారం నవంబర్ 10న హామిల్టన్‌లో అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రోజంతా సుమారు 20-45 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. గరిష్ఠ ఉష్ణోగ్రత 16-19 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 15-16 డిగ్రీల మధ్య ఉండవచ్చని సమాచారం. ఆకాశం మేఘావృతమై ఉండటంతో మ్యాచ్ నిర్వహణకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఎక్కువమంది చదివినది: SRH Retention List: కమిన్స్‌కు కావ్య మారన్ షాక్.. హైదరాబాద్ నుంచి ఆ 8 మంది ఔట్?

తొలి రెండు వన్డేలకూ వర్షం అంతరాయం!

ఈ సిరీస్‌లో ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ వర్షం ప్రభావం కనిపించింది. తొలి వన్డేలో న్యూజిలాండ్ 40.2 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత ఇన్నింగ్స్ సమయంలో వర్షం రావడంతో డక్‌వర్త్ లూయిస్ (DLS) పద్ధతిలో 34 ఓవర్లకు 143 పరుగుల లక్ష్యాన్ని నిర్ణయించారు. భారత్ 22.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

రెండో వన్డేలోనూ వరుణుడు పలుమార్లు ఆటకు అడ్డుపడ్డాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 41 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 26 ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. అప్పుడే వర్షం మరోసారి ఆటను నిలిపివేసింది. DLS పద్ధతిలో నిర్ణయించిన పార స్కోరు కంటే భారత్ నాలుగు పరుగులు ముందుండటంతో విజేతగా ప్రకటించారు.

ఎక్కువమంది చదివినది: 109 పరుగులే టార్గెట్.. 7 వికెట్లు పడినా భారత్ ఎలా గెలిచింది.. డీఎల్‌ఎస్ మెథడ్ పూర్తి లెక్క ఇదే..!

మూడో వన్డే అయినా పూర్తవుతుందా?

వరుసగా రెండు విజయాలతో జోష్ మీదున్న టీమిండియా మూడో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. అయితే హామిల్టన్ వాతావరణం ఆ ఆశలకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. వర్షం ఎంతసేపు కొనసాగుతుంది? మైదానం పరిస్థితులు ఎలా ఉంటాయి? అనే అంశాలపైనే మ్యాచ్ నిర్వహణ ఆధారపడి ఉంటుంది. వర్షం ముప్పు ఉన్నప్పటికీ మ్యాచ్ రద్దవడం ఖాయమని ఇప్పుడే చెప్పలేం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us