India vs Australia: భారత్-ఆస్ట్రేలియా మధ్య హైఓల్టేజ్ పోరు.. ఆధిపత్యం ఎవరిదో తెలుసా?

|

Sep 19, 2023 | 2:22 PM

IND vs AUS Head to Head Records: ఇరుజట్ల హెడ్ టు హెడ్ రిపోర్ట్ చూస్తే.. ఇప్పటి వరకు 146 వన్డే మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో టీం ఇండియా 54 మ్యాచ్‌లు గెలుపొందగా, ఆస్ట్రేలియా 84 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 5 మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి. అంటే భారత్‌లోనూ, భారత్‌ వెలుపల కూడా టీమ్‌ఇండియాపై ఆస్ట్రేలియా విజయం సాధించిందని స్పష్టంగా అర్థమవుతుంది.

India vs Australia: భారత్-ఆస్ట్రేలియా మధ్య హైఓల్టేజ్ పోరు.. ఆధిపత్యం ఎవరిదో తెలుసా?
Ind Vs Aus Records
Image Credit source: Insidesport
Follow us on

India vs Australia Head to Head Records: రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా 2023 ఆసియా కప్‌ను గెలుచుకుంది. ఇప్పుడు భారత జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడాల్సి ఉంది. ఇందుకోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును కూడా ప్రకటించింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ తర్వాత, రోహిత్ సేన వన్డే ప్రపంచ కప్ 2023 స్వదేశంలో ఆడనుంది. తద్వారా ప్రపంచకప్‌నకు ముందు ఆస్ట్రేలియాపై సత్తా చాటాలనే ఉద్దేశంతో టీమ్‌ఇండియా రంగంలోకి దిగింది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ 2 జట్లను ఎంపిక చేసింది. తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ (KL Rahul) నాయకత్వం వహిస్తుండగా, మూడో మ్యాచ్‌కు రోహిత్ యథావిధిగా నాయకత్వం వహించనున్నాడు.

గత ప్రపంచకప్ తర్వాత జట్ల ప్రదర్శన..

నిజానికి 2019లో చివరి వన్డే ప్రపంచకప్‌నకు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇచ్చింది. ఆ ప్రపంచకప్ తర్వాత భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు జరిగాయి. ఈ మూడు సిరీస్‌లలో భారత్‌ ఒక సిరీస్‌ను గెలుచుకోగా, ఆస్ట్రేలియా 2 సిరీస్‌లను చేజిక్కించుకుంది.

ఈ నేపథ్యంలో ఈ నాలుగో ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను భారత జట్టు గెలిస్తే.. రెండు ప్రపంచకప్‌ల మధ్య జరిగే వన్డే సిరీస్‌ను ఇరు జట్లు సమం చేస్తాయి. అంటే 2019, 2023 ప్రపంచకప్ మధ్య మొత్తం 4 ODI సిరీస్‌లలో, భారత్, ఆస్ట్రేలియా చెరో 2 సిరీస్‌లను గెలిచి సమం చేస్తాయన్నమాట.

ఇవి కూడా చదవండి

రెండు జట్ల మ్యాచ్ రిపోర్ట్..

ఇరు జట్ల గణాంకాలను పరిశీలిస్తే… ఇరు జట్లు ఇప్పటి వరకు 146 వన్డే మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో టీం ఇండియా 54 మ్యాచ్‌లు గెలుపొందగా, ఆస్ట్రేలియా 84 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మిగిలిన 10 మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి.

అలాగే, ఈ రెండు జట్లు భారత్‌లో మొత్తం 67 మ్యాచ్‌లు ఆడగా, ఇందులో భారత్ 30 మ్యాచ్‌లు గెలుపొందగా, ఆస్ట్రేలియా 32 మ్యాచ్‌లు గెలిచింది. 5 మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి. అంటే భారత్‌లోనూ, భారత్‌ వెలుపల కూడా టీమ్‌ఇండియాపై ఆస్ట్రేలియా విజయం సాధించిందని స్పష్టంగా అర్థమవుతుంది.

ODI సిరీస్ షెడ్యూల్..

మొదటి వన్డే – 22 సెప్టెంబర్ – మొహాలీ

రెండవ వన్డే – 24 సెప్టెంబర్ – ఇండోర్

మూడో వన్డే – 27 సెప్టెంబర్ – రాజ్‌కోట్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..