ఆ దాహం తీరింది.. పరుగుల యంత్రం పని మొదలు పెట్టింది. సెంచరీతో ఊగిపోయింది.. అఫ్గా్న్‌పై వీరవిహారం చేశాడు రన్ మిషన్ విరాట్ కోహ్లీ. మూడేళ్లకుపైగా వేచిచూసిన రోజు రానే వచ్చింది. విరాటుడు విలయతాండవం.. రన్.. విరాట్ విశ్వరూపంతో విరావిహారం చేశాడు. సెంచరీ కొట్టేశాడు. మూడేళ్ల కరువును.. సునామీ ఇన్నింగ్స్‌తో తీర్చాడు. కేవలం 53 బంతుల్లో సెంచరీచేసిన విరాట్ కోహ్లీ.. 61 బంతుల్లో 6 సిక్సులు, 12 ఫోర్లతో 122 పరుగులు చేశాడు. అంతర్జాతీయ కెరీర్లో 71వ సారి సెంచరీ చేశాడు. అఫ్గాన్‌తో జరిగిన ఆసియా కప్ టీ-20 మ్యాచ్‌లో వీరవిహారం చేసిన కోహ్లీ 53 బంతుల్లోనే 100 మార్కును అందుకున్నాడు.
ఆసియా కప్‌లో టీమ్ ఇండియా ప్రయాణం ఫైనల్‌కు చేరుకోకముందే ముగిసింది. అయితే తన చివరి మ్యాచ్ కోసం భారత జట్టు, ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఏమీ సాధించలేకపోయినప్పటికీ.. టీమిండియా, దాని అభిమానుల, ముఖ్యంగా విరాట్ కోహ్లీ అభిమానుల అతిపెద్ద నిరీక్షణ ముగిసింది. ఎట్టకేలకు విరాట్ కోహ్లీ 71వ సెంచరీ పూర్తి చేశాడు. ఆఫ్ఘనిస్థాన్‌పై కేవలం 53 బంతుల్లోనే కోహ్లీ తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు.
ఇది అభిమానులకే కాదు.. కోహ్లీకి కూడా మెమొరబుల్ ఇన్నింగ్స్. ఇది విరాట్ కెరీర్లో 71వ సెంచరీ మాత్రమే కాదు.. టీ20ల్లో కింగ్ కోహ్లీ తొలి సెంచరీ. ఇప్పటికే ఆసియా కప్ నుంచి వైదొలగిన భారత్‌కు ఇది శుభవార్తే. ఆసియా కప్ ప్రారంభానికి ముందు ఫామ్ గురించి చాలా ప్రశ్నలు ఎదుర్కొన్న విరాట్ కోహ్లి.. 1021 రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో తన మొదటి సెంచరీని సాధించి.. కోల్పోయిన ఫామ్‌ను తిరిగి పొందాడు. 2019 నవంబర్ నుంచి కొనసాగుతున్న కోహ్లి సెంచరీ కరువు.. గతంలో టీమిండియా తరఫున సెంచరీ చేయని ఫార్మాట్‌లో ముగిసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం