AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకరిద్దరు కాదు ఏకంగా ముగ్గురు.. రోహిత్ శర్మకు రీప్లేస్ మెంట్స్ వచ్చేశార్రోయ్..!

Rohit Sharma Replacement: ఆస్ట్రేలియా ‘A’తో భారత్ ‘A’ ఆడనున్న వన్డే సిరీస్‌లో ముగ్గురు యువ బ్యాటర్లపై ప్రత్యేక దృష్టి నెలకొంది. ప్రియాన్ష్ ఆర్య, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ తమ బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటే, 2027 వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో రోహిత్ శర్మ స్థానంపై చర్చ మరింత ఊపందుకునే అవకాశం ఉంది.

ఒకరిద్దరు కాదు ఏకంగా ముగ్గురు.. రోహిత్ శర్మకు రీప్లేస్ మెంట్స్ వచ్చేశార్రోయ్..!
Rohit Sharma Replacement
Venkata Chari
|

Updated on: Sep 10, 2026 | 7:45 AM

Share

Rohit Sharma Replacement: ఆస్ట్రేలియా ‘A’తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ (One Day series) కోసం భారత్ ‘A’ జట్టు సిద్ధమవుతోంది. ఈ జట్టులోని ముగ్గురు బ్యాటర్ల ప్రదర్శన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రియాన్ష్ ఆర్య, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ తమ స్థాయికి తగ్గట్టుగా రాణిస్తే, 2027 ప్రపంచ కప్ (2027 World Cup) దిశగా భారత జట్టులో రోహిత్ శర్మ స్థానంపై చర్చకు బలం చేకూరే అవకాశం ఉంది.

ప్రియాన్ష్ ఆర్య.. పవర్ హిట్టింగ్..

24 ఏళ్ల ప్రియాన్ష్ ఆర్యకు మొదటి నుంచే దూకుడుగా ఆడే బ్యాటర్‌గా గుర్తింపు ఉంది. ఐపీఎల్ (IPL) తో పాటు విజయ్ హజారే ట్రోపీ (Vijay Hazare Trophy) 2025/26లోనూ అతడి స్ట్రైక్‌రేట్ ఆకట్టుకుంది. ఢిల్లీ తరఫున ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 344 పరుగులు, 49.14 సగటు, ఏకంగా 163.81 స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు.

ఎక్కువమంది చదివినది: Video: 16 ఫోర్లు, 12 సిక్సర్లతో బీభత్సం.. 37 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కంటే డేంజరస్‌‌గా ఉన్నాడేందయ్యా..!

ఇవి కూడా చదవండి

జూన్‌లో శ్రీలంకలో జరిగిన ట్రై నేషన్ సిరీస్ (Tri-Nation series) లోనూ ప్రియాన్ష్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 137 పరుగులు చేశాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో 30కిపైగా స్కోర్లు సాధించాడు. ఆరంభాలను భారీ ఇన్నింగ్స్‌లుగా మలచడమే అతడికి కీలకం కానుంది.

సాయి సుదర్శన్‌కు మరో అవకాశం..

సాయి సుదర్శన్ కు వన్డే ఫార్మాట్ సహజంగా సరిపోతుందనే అంచనాలు ఉన్నాయి. విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్‌లే ఆడిన అతడు 51, 48 పరుగులు చేశాడు. అంతకుముందు సౌతాఫ్రికాలో ఇండియా A తరపున ఆడిన 50 ఓవర్ల మ్యాచ్‌ల్లో రెండు 50+ స్కోర్లు సాధించాడు.

2023/24లో దక్షిణాఫ్రికాతో ఇండియా ఏ తరపున 3 ఇన్నింగ్స్‌ల్లో 127 పరుగులు, 63.5 సగటు, 89.44 స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఐపీఎల్ లో ఓపెనింగ్ చేసిన అనుభవం కూడా అతడికి ఉంది.

పడిక్కల్.. స్థిరత్వమే బలం..

ఈ ముగ్గురిలో దేవదత్ పడిక్కల్కు దేశవాళీ క్రికెట్ గణాంకాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఐపీఎల్, టెస్టుల్లో నంబర్ 3లో ఆడినప్పటికీ, కర్నాటక తరపున లిస్ట్ ఏ క్రికెట్‌లో ప్రధానంగా ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నాడు.

ఎక్కువమంది చదివినది: Video: 20 ఏళ్ల తర్వాత తొలిసారి చెత్త రికార్గ్.. మరోసారి పాకిస్తాన్ ఇజ్జత్ పాయే.. అదేంటో తెలుసా?

విజయ్ హజారే ట్రోఫీలో పడిక్కల్ 9 ఇన్నింగ్స్‌ల్లో 725 పరుగులు చేశాడు. అతడి సగటు 90.63 కాగా, స్ట్రైక్‌రేట్ 98.24. అంతకుముందు 2024/25 సీజన్‌లోనూ మూడు ఇన్నింగ్స్‌ల్లో రెండు 80+ స్కోర్లు సాధించాడు.

ఆస్ట్రేలియా ‘A’ సిరీస్ కీలకం..

భారత్ ‘A’ వన్డే జట్టులో ఈ ముగ్గురికీ ఆస్ట్రేలియా ‘A’ సిరీస్ మంచి వేదిక కానుంది. ప్రియాన్ష్ ఆర్య దూకుడు, సాయి సుదర్శన్ స్థిరత్వం, పడిక్కల్ దేశవాళీ రికార్డు.. ముగ్గురి బలాలు వేర్వేరుగా ఉన్నాయి. ఈ సిరీస్‌లో వారి ప్రదర్శనలు రోహిత్ శర్మ తర్వాతి తరం కోసం భారత్ పరిశీలిస్తున్న ఆప్షన్లపై ఆసక్తిని పెంచనున్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రోహిత్ శర్మకు రీప్లేస్ మెంట్స్ వచ్చేశార్రోయ్..!
రోహిత్ శర్మకు రీప్లేస్ మెంట్స్ వచ్చేశార్రోయ్..!
SIR సిత్రాలు.. భారతరత్న సైంటిస్టుకు నోటీసులు! అసలేం జరిగిందంటే?
SIR సిత్రాలు.. భారతరత్న సైంటిస్టుకు నోటీసులు! అసలేం జరిగిందంటే?
దులీప్ ట్రోఫీ 2026 విజేత దక్కించుకునే ప్రైజ్ మనీ ఎంతంటే?
దులీప్ ట్రోఫీ 2026 విజేత దక్కించుకునే ప్రైజ్ మనీ ఎంతంటే?
ఇకపై ఏసీ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం.. మహిళలకు పండుగే..
ఇకపై ఏసీ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం.. మహిళలకు పండుగే..
గుడ్‌న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరో 3 ఏళ్లు వయో సడలింపు!
గుడ్‌న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరో 3 ఏళ్లు వయో సడలింపు!
టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం
టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం
పొద్దున్నే ఒక గుడ్డు తింటే 100 ఏనుగుల బలం.. పెంకు ఈజీగా రావాలంటే
పొద్దున్నే ఒక గుడ్డు తింటే 100 ఏనుగుల బలం.. పెంకు ఈజీగా రావాలంటే
డెలివరీ బాయ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..
డెలివరీ బాయ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..
త్రిగుణ్ ఆ బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్‌కు దగ్గరి బంధువా?
త్రిగుణ్ ఆ బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్‌కు దగ్గరి బంధువా?
టీమిండియాలో సడన్ ఎంట్రీ.. అసలెవరీ నచికేత్ భూటే
టీమిండియాలో సడన్ ఎంట్రీ.. అసలెవరీ నచికేత్ భూటే