శ్రీలంకతో టీ20 సిరీస్(IND vs SL)కు ముందు టీమ్ ఇండియాకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మొదట స్టార్ ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్(deepak chahar) గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar yadav) శ్రీలంక సిరీస్‌కు దూరమవుతున్నట్లు తెలుస్తుంది. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా క్లీన్ స్వీప్ చేయడంలో ఈ ఆటగాడు కీలక పాత్ర పోషించాడు. ఫిబ్రవరి 24 నుంచి ఇరు దేశాల మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.
సిరీస్‌లో మొదటి మ్యాచ్ లక్నోలో జరగనుండగా, మిగిలిన రెండు మ్యాచ్‌లు ధర్మశాలలో జరగనున్నాయి. ఏడాది చివర్లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సన్నద్ధమవుతున్న భారత జట్టుకు ప్రస్తుతం ప్రతి టీ20 సిరీస్ ఎంతో కీలకం. ప్రతి సిరీస్‌లో చేస్తున్న ప్రయోగాలతో పాటు కీలకమైన ఈ టోర్నీకి జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ప్రస్తుతం సూర్యకుమార్ బృందంతో కలిసి లక్నోలో ఉన్నారు. మంగళవారం జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో కూడా అతను భాగమయ్యాడు.
అయితే, క్రిక్‌బజ్ వార్తల ప్రకారం అతను T20 సిరీస్‌కు అనర్హుడని తెలుస్తుంది. అయితే అతడికి ఈ గాయం ఎప్పుడు, ఎలా అయిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. వెస్టిండీస్‌తో సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన సూర్యాకుమార్ యాదవ్ 107 పరుగులు చేశాడు. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దీపక్ చాహర్ కూడా గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో మరియు చివరి టీ20 మ్యాచ్‌లో గాయపడిన అతను మైదానం మధ్యలోనే నిష్క్రమించాడు.
Read Also.. Viral Video: తగ్గేదేలే.. టీమిండియా ప్లేయర్ల సందడి మాములుగా లేదుగా.! ఈ క్రేజ్ ఏంటి ‘సామీ’..