IND vs SL: టీమిండియాకు ఎదురు దెబ్బ.. బౌన్సర్ తగిలి ఆస్పత్రిలో చేరిన ఆటగాడు..

|

Feb 27, 2022 | 8:44 AM

టీమిండియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది..

IND vs SL: టీమిండియాకు ఎదురు దెబ్బ.. బౌన్సర్ తగిలి ఆస్పత్రిలో చేరిన ఆటగాడు..
Ishan Kishan
Follow us on

టీమిండియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కీపర్,బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌(ishan kishan)ను ఆస్పత్రిలో చేర్పించారు. అతను ధర్మశాలలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బౌన్సర్ తగలడంతో అతను గాయపడింది. ఈ ఘటన భారత ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో చోటుచేసుకుంది. నాలుగో ఓవర్ రెండో బంతిని శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లహిరు కుమార(lahiru kumara) గంటకు 146 కిలోమీటర్ల వేగంతో వేశాడు. అది బౌన్స్ అయింది. ఆ బంతిన ఆడడానికి ఇషాన్ ప్రయత్నించాడు కానీ ఆ బంతి హెల్మెంట్‌(హెల్మెంట్)కు బలంగా తాకింది. బంతి తగిలిన తర్వాత ఇషాన్ కాసేపు మైదానంలో కూర్చుండిపోయాడు.

ఫిజియో వెంటనే మైదానానికి వచ్చి ఇషాన్‌ను పరీక్షించాడు. కిషన్ ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్‌ చేశాడు. ఇషన్ చివరికి లహిరు కుమార బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ ఆడుతున్నంత సేవు ఇబ్బందిగానే ఆడాడు. అతను15 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. మ్యాచ్‌ అనంతరం ఇషాన్‌ కిషన్‌ను ఫోర్టిస్‌ ఆస్పత్రిలో చేర్చారు. సిటీ స్కాన్ కూడా తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ మ్యాచ్‌లో భారత్ లంకపై 7 వికెట్ల తేడాతో గెలిచింది. మొదటగా బ్యాటింగ్ చేసిన లంకేయులు 183 పరుగులు చేసింది. ఇండియా మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) అజేయంగా 74 (44 బంతుల్లో), రవీంద్ర జడేజా(Ravindra Jadeja) అజేయంగా 45 (18 బంతుల్లో) పరుగులు చేశారు. సంజూ శాంసన్ 39 పరుగులు చేశాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్‌కు ఇది వరుసగా 11వ విజయం. భారత్‌ కేవలం మరో విజయంతో ప్రపంచ రికార్డును సమం చేసేందుకు సిద్ధమైంది. ఆఫ్ఘనిస్థాన్ వరుసగా 12 టీ20 మ్యాచ్‌లు గెలిచింది. సొంతగడ్డపై ఈ ఫార్మాట్‌లో భారత్‌ వరుసగా ఏడో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Read Also..  IND vs SL: కోహ్లీ స్పెషల్ మ్యాచ్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం.. మండిపడుతోన్న ఫ్యాన్స్..