IND vs SA 1st T20 Match Playing 11: యువ భారత్ ప్రపంచ రికార్డ్ సృష్టించేనా? సౌతాఫ్రికాతో సమరానికి సిద్ధం..

|

Jun 09, 2022 | 6:44 AM

IND Vs SA 1st T20 Match Preview: ప్రస్తుతం, భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్, రొమేనియా నెలకొల్పిన ప్రపంచ రికార్డుతో సమానంగా నిలిచింది. అయితే దక్షిణాఫ్రికాపై ఢిల్లీలో గెలిస్తే ఈ రికార్డులో నంబర్ వన్‌గా మారనుంది.

IND vs SA 1st T20 Match Playing 11: యువ భారత్ ప్రపంచ రికార్డ్ సృష్టించేనా? సౌతాఫ్రికాతో సమరానికి సిద్ధం..
Ind Vs Sa 1st T20
Follow us on

ఐపీఎల్ 2022 (IPL 2022) ముగిసిన తర్వాత, టీమిండియా(Team India) ఆటగాళ్లు తొలి అంతర్జాతీయ సిరీస్ ఆడనున్నారు. దక్షిణాఫ్రికా(IND vs SA)తో టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఇందులో భాగంగా ఢిల్లీలో నేడు తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా ముందు ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. కానీ, చివరి క్షణంలో టీమిండియాలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కెప్టెన్ రూపంలో భారీ షాక్ తగిలింది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో జరగాల్సిన ఈ సిరీస్.. ప్రస్తుతం రిషబ్ పంత్ నేతృత్వంలో జరగనుంది. దీంతో ఢిల్లీలో గెలిచి, ప్రపంచ రికార్డును నెలకొల్పుతారా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్ , రొమేనియా నెలకొల్పిన ప్రపంచ రికార్డుకు సమం చేస్తే సత్తా ఉన్నా.. కీలక ప్లేయర్లు లేకపోవడంతో.. ఈ సిరీస్‌లో ఎలా రాణిస్తారో చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు వరుసగా 12 టీ20 మ్యాచ్‌లు గెలిచిన, టీమిండియా.. ఆ రెండు జట్లతో కలిపి ప్రపంచ రికార్డును కలిగి ఉంది. మరి ఈ మ్యాచ్‌లో ఏం జరగనుంది, అసలు టీమిండియా ప్లేయింగ్ XIలో ఎవరున్నారో చూద్దాం..

నవంబర్ 2021 నుంచి ప్రపంచ రికార్డు ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో మొదటిగా ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఓడించింది. ఆ తర్వాత స్కాట్లాండ్, నమీబియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంకతో జరిగిన తదుపరి 11 మ్యాచ్‌లలో గన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌లో దక్షిణాఫ్రికా టీం భారత్ పర్యటనకు వచ్చింది. అయితే దక్షిణాఫ్రికా టీంతో సవాల్ అంత సులువు కాదు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి- మొదటిది, టీమిండియాలో ప్రస్తుతం తక్కువ అనుభవం ఉంది. రెండవది, సొంతగడ్డపై టీ20లో దక్షిణాఫ్రికాపై పేలవమైన రికార్డు నెలకొంది.

యంగ్ ఇండియా సత్తా చాటేనా?

కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్‌లు సిరీస్‌కు దూరమైన తర్వాత.. టీంలో అనుభవం చాలా లోపించింది. మరోవైపు, దక్షిణాఫ్రికా జట్టు పూర్తి బలంతో ఉంది. సౌతాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడటం వల్ల, భారతదేశ పరిస్థితులకు బాగా అలవాటు పడ్డారు. దీంతో యంగిస్థాన్ ప్రతి మ్యాచ్ సరైన వ్యూహంతో బరిలోకి దిగాల్సి ఉంటుంది.

సౌతాఫ్రికాపై స్వదేశంలో చెత్త రికార్డు..

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన రికార్డు గురించి మాట్లాడితే, ఇప్పటి వరకు భారత్ సొంత గడ్డపై దక్షిణాఫ్రికాపై ఏ టీ20 సిరీస్‌ను గెలవలేదు. ఇప్పటి వరకు భారత మైదానంలో ఇరు జట్ల మధ్య 4 టీ20 మ్యాచ్‌లు జరగ్గా అందులో టీమ్ ఇండియా ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలుపొందగా, దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్‌లు గెలిచింది.

మొత్తం గణాంకాల్లో టీమ్ ఇండియా రికార్డులు..

టీ20లో ఇరు జట్ల ఓవరాల్ గణాంకాలను పరిశీలిస్తే భారత్‌దే పైచేయి కనిపిస్తోంది. 2006 నుంచి రెండు జట్లు ఒకదానితో ఒకటి 15 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమ్ ఇండియా 9 సార్లు గెలుపొందగా, దక్షిణాఫ్రికా 6 సందర్భాలలో మాత్రమే గెలిచింది. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి ఐదు మ్యాచ్‌ల విషయానికొస్తే, రెండు జట్లు తలో 2 మ్యాచ్‌లు గెలుపొందగా, ఒక మ్యాచ్ రద్దైంది.

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI..

భారత్: 1. రుతురాజ్ గైక్వాడ్, 2. ఇషాన్ కిషన్, 3. శ్రేయాస్ అయ్యర్, 4. రిషబ్ పంత్ (కెప్టెన్, కీపర్), 5. దినేష్ కార్తీక్, 6. హార్దిక్ పాండ్యా, 7. అక్షర్ పటేల్, 8. భువనేశ్వర్ కుమార్, 9. హర్షల్ పటేల్, 10. యుజ్వేంద్ర చాహల్, 11. ఉమ్రాన్ మాలిక్ / అవేష్ ఖాన్.

దక్షిణాఫ్రికా: 1. క్వింటన్ డి కాక్ (కీపర్), 2. రీజా హెండ్రిక్స్, 3. రాస్సీ వాన్ డెర్ డస్సెన్, 4. ఐడెన్ మార్క్‌రామ్, 5. టెంబా బావుమా (కెప్టెన్), 6. డేవిడ్ మిల్లర్, 7. డ్వైన్ ప్రిటోరియస్, 8. కగిసో రబడ, 9. కేశవ్ మహారాజ్, 10. తబ్రైజ్ షమ్సీ, 11. అన్రిచ్ నోర్ట్జే.