IND vs PAK: ‘మాతో ఆడితే మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.. జర జాగ్రత్త’: షోయబ్ అక్తర్‌కు వార్నింగ్ ఇచ్చిన టీమిండియా మాజీ ప్లేయర్

|

Oct 16, 2021 | 7:55 PM

ICC T20 World Cup 2021: యూఏఈలో ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్ 12 లో అక్టోబర్ 24 న భారత్ వర్సెస్ పాకిస్తాన్ తలపడతాయి. దాయాదుల పోరుకు ముందు హర్భజన్ సింగ్, షోయబ్ అక్తర్‌పై విరుచుకుపడ్డాడు.

IND vs PAK: మాతో ఆడితే మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.. జర జాగ్రత్త: షోయబ్ అక్తర్‌కు వార్నింగ్ ఇచ్చిన టీమిండియా మాజీ ప్లేయర్
T20 World Cup 2021 Harbhajan Singh And Shoaib Akhtar
Follow us on

Ind vs Pak: ఐపీఎల్ సీజన్ ముగిసింది. రేపటి నుంచి టీ20 ప్రపంచ కప్‌ హోరు మొదలుకానుంది. ఆదివారం నుంచి నవంబర్ 14 వరకు క్రికెట్ ప్రేమికులకు సందడే సందడి. అయితే అన్నింటి కంటే ముఖ్యంగా అందిరి చూపు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పైనే ఉంది. రెండు దేశాల మధ్య రాజకీయ పరిస్థితుల కారణంగా ఐసీసీ టోర్నమెంట్ల సమయంలో ఇరు పక్షాలు పోటీపడుతున్నప్పుడు ఎంతో హైప్ ఏర్పడుతుంది. గతంలో 2019 ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో ఇరు జట్లు పరస్పరం తలపడ్డాయి. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో పాకిస్తాన్‌పై భారత్ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 సూపర్ 12 సందర్భంగా అక్టోబర్ 24 న ఇరు జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే క్రికెట్ లోకమంతా ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తన స్నేహితుడు, ప్రముఖ పాకిస్థానీ పేసర్ షోయబ్ అక్తర్‌పై విరుచుకుపడ్డాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ టీం భారత్‌ను ఓడించే అవకాశం లేదని తెలిపారు.

అయితే 2019లో హర్భజన్, షోయబ్ అక్తర్‌ల మధ్య జరిగిన సంభాషణను ఓ ఛానల్‌తో పంచుకున్నాడు. “నేను షోయబ్ అక్తర్‌తో చెప్పాను. మాకు వ్యతిరేకంగా ఆడటం ఏమిటి? చాలా దృఢమైన జట్టు. అలాగే చాలా బలమైన జట్టు. ఇది మీ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది” అని హర్భజన్ స్టార్ స్పోర్ట్స్‌తో అన్నారు.

పాకిస్తాన్ టీం భారత్‌ను టీ 20, వన్డే – ప్రపంచ కప్‌లో ఇప్పటి వరకు ఓడించలేదు. వన్డే వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు ఏడు మ్యాచుల్లో తలపడ్డాయి. ఈ ఏడు మ్యాచుల్లో భారత జట్టే విజయం సాధించింది. అదేవిధంగా టీ20 వరల్డ్ కప్‌లలో ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య నాలుగు మ్యాచులు జరిగాయి. ఇందులో భారత్ 4-0 రికార్డును కలిగి ఉంది. 2007 లో మెన్ ఇన్ బ్లూ బౌల్ ఔట్ పోటీలోనూ గెలిచింది. దీంతో ఐదో మ్యాచుల్లోనూ విజయం సాధించింది.

అక్టోబర్ 24 న యూఏఈలోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి.

టీ 20 ప్రపంచకప్ కోసం ఇరు జట్ల స్వాడ్స్:

భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), ఇషాన్ కిషన్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ మరియు శార్దుల్ ఠాకూర్.

రిజర్వ్ ప్లేయర్స్: శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్.

పాకిస్తాన్: బాబర్ అజామ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ వసీం జూనియర్, సర్ఫరాజ్ అహ్మద్, షహీన్ షా అఫ్రిది మరియు షోయబ్ మాలిక్.

రిజర్వ్ ప్లేయర్స్: ఖుష్దిల్ షా, షానవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్.

Also Read: T20 World Cup 2021: ఫోర్లు కొట్టడంలో ఈ బ్యాట్స్‌మెన్ల రూటే సపరేటు.. పొట్టి ప్రపంచ కప్‌లో టాప్‌ 5లో ఎవరున్నారో తెలుసా?

T20 World Cup 2021: రేపటి నుంచే మహా సంగ్రామం.. ఫార్మాట్, ప్రైజ్‌మనీ, షెడ్యూల్ లాంటి పూర్తి వివరాలు మీకోసం..!