కాన్పూర్‌లో జరుగుతున్న టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌లో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఒక పరుగు మాత్రమే చేశాడు. అయితే అతడు రెండు ఇన్నింగ్స్‌ల్లో జేమీసన్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. గిల్ ఔటైన తీరుపై మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించారు. గిల్లో లోపాన్ని ఎత్తి చూపాడు. లోపాన్ని సరిదిద్దుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పాడు. గిల్ తన బ్యాటింగ్ టెక్నిక్‌లో మార్పు చేసుకోవాలని పఠాన్ సూచించాడు. గిల్ ముఖ్యంగా పిచ్-అప్ డెలివరీలకు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాడని పేర్కొన్నాడు. అతడిలో చాలా ప్రతిభ దాగి ఉందని. ఆ బంతులను అతడు ఎదరుర్కొంటే చాలు.. తిరుగు ఉండదని ఇర్ఫాన్ అన్నాడు. గిల్ అవుటైన విధానం గమనిస్తే.. అతడి రెండు పాదాలు ఒకే చోట ఉన్నాయని.. అందుకే బ్యాట్‌తో బంతిని ఆపేందుకు సమయం పట్టిందని విశ్లేషించాడు. అతని బ్యాట్, ప్యాడ్ మధ్య పెద్ద గ్యాప్ ఉందన్నాడు.
“ఇది అస్సలు సులభం కాదు. లైట్లు ఆన్‌లో ఉన్నాయి, బంతి కదులుతుంది.మీరు బయటకు వెళ్లకుండా వెనక్కి వెళ్లాలని మీకు తెలుసు. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ సాధారణంగా ఒత్తిడి కారణంగా ఔట్ అవుతారు. అయితే శుభ్‌మాన్ గిల్ తన టెక్నిక్‌పై ఖచ్చితంగా పని చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పిచ్-అప్ డెలివరీలను బాగా ఎదుర్కొవాలి. ”అని పఠాన్ చెప్పాడు.
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఆర్డర్లో అగ్రస్థానంలో ఉన్నందున, గిల్ మిడిల్ ఆర్డర్లో సర్దుబాటు చేయవలసి ఉంటుందని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అన్నాడు. శ్రేయాస్ అయ్యర్ అరంగేట్రంలో సెంచరీ చేసినప్పటి నుంచి ఇది గ్యారెంటీ స్పాట్ కానప్పటికీ, అతను బ్యాటింగ్ చేస్తే అతని ప్రతిభ బయటపడుతుందని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. “నేను అతను ఆడటం చూసినప్పుడల్లా, అతను టెస్ట్ ఓపెనర్ లాగా కనిపించడు. నాకు. అతను లైన్ లోపల ఆడే విధానం, బయటి అంచు, లోపలి అంచు రెండూ బహిర్గతమవుతాయి. నా అభిప్రాయం ప్రకారం, అతను మిడిల్ ఆర్డర్ బ్యాటర్” అని చోప్రా పేర్కొన్నాడు.
Read Also.. MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ ధోనిని కొనసాగిస్తుంది.. మాజీ పేసర్ సైమన్ డౌల్..