IND vs AUS: టాస్​ గెలిచిన ఆసీస్.. భారత్‌ బౌలింగ్‌.. టీమిండియా తుది జట్టులోకి సూర్యకుమార్ స్థానంలో అయ్యర్..

|

Feb 17, 2023 | 9:43 AM

భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈరోజు ఫిబ్రవరి 17న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రెండో మ్యాచ్ జరగనుంది.ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

IND vs AUS:  టాస్​ గెలిచిన ఆసీస్.. భారత్‌ బౌలింగ్‌.. టీమిండియా తుది జట్టులోకి సూర్యకుమార్ స్థానంలో అయ్యర్..
India Australia
Follow us on

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌  ఫైనల్‌ బెర్తు దిశగా టీమిండియా మరో సమరానికి రెడీ అవుతోంది. మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే రెండో టెస్టు మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ కెప్టెన్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై మరోసారి ఆసీస్‌ను చిత్తుచేసి.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించాలని టీమిండియా భావిస్తోంది. ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో ఆడిన 24 టెస్టుల్లో భారత్‌ 20 టెస్టుల్లో గెలిచింది.

ఢిల్లీ టెస్టులో టీమిండియా గెలవడం చాలా స్పెషల్ . రెండో టెస్టులో గెలిస్తే ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుంది. ఈ విజయంతో భారత్ వరుసగా రెండోసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంటుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానంలో ఉంది. పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా ఈ సిరీస్‌లో పునరాగమనంపై కన్నేసింది.

ఆస్ట్రేలియా- భారతదేశం (IND vs AUS) మధ్య మొత్తం 103 టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. ఆస్ట్రేలియా 43 మ్యాచ్‌లు గెలుపొందగా, భారత్ 31 మ్యాచ్‌లు గెలిచింది. వీరిద్దరి మధ్య 28 డ్రాలు, ఒక టై అయ్యాయి. అయితే స్వదేశంలో భారత జట్టు మంచి ఫామ్‌లో ఉంది. వీరిద్దరి మధ్య భారత గడ్డపై 51 మ్యాచ్‌లు జరగగా, అందులో భారత్ 22 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఆస్ట్రేలియా 13 మ్యాచ్‌లు గెలవగా, ఇరు జట్ల మధ్య 15 మ్యాచ్‌లు డ్రా కాగా, ఒక మ్యాచ్ టై అయింది.

ఛెతేశ్వర్ పుజారాకు 100 టెస్టు మ్యాచ్:

బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పుజారా తన కెరీర్‌లో 100వ టెస్టు ఆడనున్నాడు. టెస్టు క్రికెట్‌లో 100 మ్యాచ్‌లు ఆడిన 13వ భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ టెస్టులో పుజారా సెంచరీ సాధిస్తే 100వ టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ప్రపంచంలో కేవలం 10 మంది బ్యాట్స్‌మెన్ మాత్రమే తమ 100వ టెస్టులో సెంచరీ చేయగలిగారు. 100వ టెస్టులో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా ఇంగ్లండ్‌ ఆటగాడు కోలిన్‌ కౌడ్రీ నిలిచాడు.

టీమిండియా జట్టు ఇదే:

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్ (కీపర్), ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్..

ఆస్ట్రేలియా జట్టు ఇదే..

డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, అలెక్స్ కారీ (కీపర్), పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), టాడ్ మర్ఫీ, నాథన్ లియోన్, మాథ్యూ కుహ్నెమాన్..

ఢిల్లీలో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఇప్పటివరకు మొత్తం 7 టెస్టులు జరగ్గా.. అందులో ఒకటి మాత్రమే గెలిచారు. 1959లో ఢిల్లీలో భారత్‌ను ఓడించడంలో ఆస్ట్రేలియా విఫలమైన తర్వాత కంగారూలు ఈ విజయాన్ని సాధించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం