
IND vs AFG, 1st T20I Live Streaming: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా రేపు జనవరి 11న ప్రారంభం కానున్న తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీం ఇండియా (India vs Afghanistan), ఇబ్రహీం జద్రాన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడనున్నాయి . 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli) తొలిసారి టీ20 మైదానంలో బ్యాటింగ్ చేయనుండడం ఈ మ్యాచ్ ప్రత్యేకత. అలాగే, రాబోయే T20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కంటే ముందు టీమ్ ఇండియా ఆడే చివరి T20 సిరీస్ కావడంతో, T20 ప్రపంచ కప్ కోసం సన్నాహక పరంగా కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ సిరీస్ చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ మొహాలీలో జరగనుంది. మ్యాచ్ గురించి పూర్తి వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
జనవరి 11వ తేదీ గురువారం భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.
భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య తొలి టీ20 మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ టాస్ సాయంత్రం 6:30 గంటలకు జరుగుతుంది.
మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో భారత్, అఫ్గానిస్థాన్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది.
స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరిగే తొలి టీ20 మ్యాచ్‌ని వీక్షించవచ్చు.
భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మొదటి T20 మ్యాచ్ JioCinema యాప్, వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.
What do you all make of this power-packed T20I squad set to face Afghanistan? 😎#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/pY2cUPdpHy
— BCCI (@BCCI) January 7, 2024
టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యస్సవి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
ఆఫ్ఘనిస్థాన్ జట్టు: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇక్రమ్ అలీఖిల్, హజ్రతుల్లా జజాయ్, రహమత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్ముల్లా ఉమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మల్, ఫజుల్ హక్మాల్, నవ్ హక్మాల్, మహ్మద్ సలీమ్, కైస్ అహ్మద్, గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..